Restrictions on New Year celebrations: రాష్ట్రంలో కోవిడ్, ఓమిక్రాన్ నియంత్రణలో భాగంగా జనవరి 2వ తేదీ వరకు ర్యాలీలు, బహిరంగ సభలను నిషేధిస్తున్నట్టు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం.మహేందర్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలకు, పోలీస్ కమీషనర్ల ఆదేశాలు జారీ చేశామని డీజీపీ తెలిపారు. కోవిడ్ నిబంధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను అమలు చేస్తున్నామని, ప్రతీ ఒక్కరు విధిగా మాస్కులను ధరించడంతోపాటు, సామాజిక దూరం పాటించాలనే అంశాలపట్ల ప్రజలను చెతన్య వంతులను చేస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్క్ ధరించని వారికి నిబంధనలను అనుసరించి వెయ్యు రూపాయల ఫైన్ ను విదించనున్నామని స్పష్టం చేశారు. ప్రతీ ఒక్కరు కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అనుమతి పొందిన కార్యక్రమాలలో విధిగా కోవిద్ నియమ, నిబంధనలను పాటించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను కోరామని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఆంక్షలు అమలు అవుతాయన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించే విధంగా ఈ ఆదేశాలు అమలు చేయాలని పోలీసులను ఆదేశించామన్నారు. వేడుకలను ప్రశాంత వాతావరణం జరిగేలా ప్రజలు సహకరించాలన్నారు. కోవిడ్ నిబంధనలో ఆరోగ్య శాఖ ఇచ్చిన సూచనలు అమలు చేస్తామన్నారు. ఎయిర్ పోర్ట్ లో కూడా టెస్టులు చేసి, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశాము, ఎక్కడైనా ఇంకా మిగిలిపోయి ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తున్నామని డీజీపీ తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ లు ధరించి డ్యూటీ చేయాలని సూచించారు. పబ్బులు, ఈవెంట్స్ పై ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
Also Read: