ఐదు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం.. తెలుగు రాష్ట్రాల్లో రక్తమోడిన రహదారులు
Andhra Pradesh & Telangana News: తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడుతున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు చనిపోగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
AP & Telangana Road Accident: తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఏడుగురు చనిపోగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. అనంతపురం జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. విడపనకల్లు మండలం పెద్దవంక దగ్గర నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిపై నుంచి కారు కింద పడిపోయింది. 30 నుంచి 40 అడుగుల లోతులో కారు పడిపోగా.. గంటల పాటు శ్రమించి ఆ కారును రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. ఆ కారు నుంచి ఓ మృతదేహాన్ని బయటకుతీశారు. మృతుడు బళ్లారికి చెందిన అశ్వర్థ నారాయణగా గుర్తించారు.
అటు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోనూ రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని.. కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మృతులు కడప జిల్లా రాజంపేట మండలం చెర్లోపల్లి ఎస్సీ కాలనీకి చెందిన 40 ఏళ్ల లక్ష్మయ్య, 60 ఏళ్ల నరసమ్మగా గుర్తించారు అధికారులు. లారీని ఓవర్‌టేక్ చేయబోసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.
గన్నవరం వద్ద.. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద రోడ్ ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయాడు. పలాస నుండి బస్సు విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాద జరిగింది. యాక్సిడెంట్ సమయంలో బస్సులో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
హైదరాబాద్‌లో ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. హయత్‌నగర్ హైవే 65 పై ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కూలీలు ఉన్న ఓ ట్రాక్టర్.. పెద్దంబర్‌పేట్ నుంచి హయత్‌నగర్‌కు వెళ్తోంది. డీడ్ స్కూల్ ముందు U టర్న్ తీసుకుంటుండగా.. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ.. వెనుతక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అల్లప్పతో పాటు ముగ్గురు క్షతగాత్రులను OGHకి తరలించారు.
మెదక్ జిల్లాలో ప్రమాదం.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి దగ్గర జాతీయ రహదారి 161పై.. బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలోనూ ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. పెట్రోల్ ట్యాంక్‌కి మంటలు అంటుకోవడంతో.. బైక్‌తో పాటు ఓ యువకుడు మంటల్లో కాలిపోయాడు.
Also Read..
Vijay Devarakonda’s Liger: మరోక్రేజీ అప్ డేట్ ఇచ్చిన లైగర్ టీమ్.. అదిరిపోయిన బీటీఎస్ స్టిల్స్..