Sant Kalicharan: ధర్మసంసద్‌లో మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధు కాళీచరణ్ అరెస్ట్

Sant Kalicharan: ధర్మసంసద్‌లో మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాధు కాళీచరణ్ అరెస్ట్
Sant Kalicharan

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ పోలీసులు 'ధర్మ సంసద్'లో మహాత్మా గాంధీజీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణతో మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో సాధు కాళీచరణ్ మహారాజ్‌ను అరెస్టు చేశారు.

Balaraju Goud

|

Dec 30, 2021 | 11:07 AM

Sant Kalicharan Arrest: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ పోలీసులు ‘ధర్మ సంసద్’లో మహాత్మా గాంధీజీకి వ్యతిరేకంగా చేసిన ఆరోపణతో మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో సాధు కాళీచరణ్ మహారాజ్‌ను అరెస్టు చేశారు. అతనిపై రాయ్‌పూర్‌లోని తిక్రపరా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన ముగింపు వేడుకల చివరి రోజున దేశ విభజనకు బాపుజీ కారణమంటూ సంత్ కాళీచరణ్ జాతిపిత మహాత్మా గాంధీ గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. జాతిపిత మహాత్మాగాంధీపై చేసిన ఈ వివాదాస్పద ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో మహాత్మా గాంధీపై చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాళీచరణ్ మహారాజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

చత్తీస్‌గడ్ రాజధాని రాయ్‌పూర్‌లోని రావణ భట మైదాన్‌లో ఏర్పాటు చేసిన రెండు రోజుల కార్యక్రమం ముగింపు రోజున కాళీచరణ్ మాట్లాడుతూ.. జాతిపిత మహాత్మా గాంధీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, “రాజకీయాల ద్వారా దేశాన్ని స్వాధీనం చేసుకోవడమే ఇస్లాం లక్ష్యం. వారు దానిని 1947లో మన కళ్ల ముందు బంధించారు. వారు గతంలో ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లను ఆక్రమించారు. రాజకీయాల ద్వారా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను కూడా ఆక్రమించారు. మోహన్‌దాస్ కరంచంద్ గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సేకి నేను వందనం చేస్తున్నాను. అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈ ధర్మసంసద్‌కు నీలకంఠ సేవా సంస్థాన్, గౌ సేవా ఆయోగ్ చైర్మన్ మహంత్ రాంసుందర్ దాస్ పోషకుడుగా వ్యవహరించడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మాజీ సీఎం డాక్టర్ రమణ్ సింగ్, కార్పొరేషన్ చైర్మన్ ప్రమోద్ దూబే, బీజేపీ నేత సచ్చిదానంద్ ఉపాసనే సహా పలువురు బీజేపీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సంత్ కాళీచరణ్ మధ్యప్రదేశ్‌లోని ప్రసిద్ధ భోజ్‌పూర్ శివాలయంలో శివ తాండవ స్తోత్రం పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీడియోను సినీ నటుడు అనుపమ్ ఖేర్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

Read Also… Chanakya Niti: మీరు మోసపోకుండా ఉండాలంటే.. ఈ విషయాలను అర్ధం చేసుకుని నడుచుకోవాలంటున్న చాణక్య

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu