Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీరు మోసపోకుండా ఉండాలంటే.. ఈ విషయాలను అర్ధం చేసుకుని నడుచుకోవాలంటున్న చాణక్య

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలకులు ప్రజలకు చేయాల్సిన మేలుని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషయాలను..

Chanakya Niti: మీరు మోసపోకుండా ఉండాలంటే.. ఈ విషయాలను అర్ధం చేసుకుని నడుచుకోవాలంటున్న చాణక్య
Chanakya
Follow us
Surya Kala

|

Updated on: Dec 30, 2021 | 9:54 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. పాలకులు ప్రజలకు చేయాల్సిన మేలుని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషయాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. ఈ నీతి శాస్త్రంలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తూ అనేక విషయాలను విశదీకరించారు. చాణక్యుడు  బహుముఖ ప్రజ్ఞాశాలి. సుసంపన్నడు. కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లతో కూడా ఆయనను పిలుస్తారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను పొందుపరిచాడు.  అవి నేటికీ ప్రజలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఈరోజు మనిషి మోసపోకుండా ఉంటాలంటే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాణిక్యుడు చెప్పిన విషయాల గురించి తెలుసుకుందాం.

ఎవరైనా కాళ్లకు ముళ్ల గుచ్చుకోకుండా నడవాలనుకుంటే.. పాదాలకు చెప్పులు ధరించాలి. అదే విధంగా ఎవరైనా దుర్మార్గులను నివారించాలనుకుంటే.. వారి లోపాలను ఎత్తిచూపుతూ.. పదిమందికి వారి గురించి తెలియజేయండి.. అప్పుడు వారు మీ ముందు తల ఎత్తడానికి ధైర్యం చేయరు.

సిగ్గులేని వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. తన గౌరవాన్ని పట్టించుకోని వ్యక్తి, అవతలి వారి గౌరవం,  విలువను అతను ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే… మీ గౌరవం తగ్గించుకున్నట్లే..

ఎవరికైనా నాలుగు వేదాలు , ధర్మశాస్త్రాల గురించి జ్ఞానం ఉండవచ్చు. అయితే మీ గురించి మీకు పరిపూర్ణంగా తెలియకపోతే అవన్నీ వ్యర్థం.. ఎలా అంటే.. జీవితం ఒక చెంచా లాంటిది. భోజనం చేసే సమయంలో అన్ని వంటకాలను తాకుతుంది. అయితే అది ఏ వంటని రుచి చూడలేదు.

ఏదైనా ముఖ్యమైన పనిని ప్లాన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు ప్రణాళికను ఎవరితోనూ పంచుకోకూడదు. కొంచెం నిర్లక్ష్యం ఉంటే.. అప్పుడు శత్రువు ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు ప్రణాళిక ఫలించి పని పూర్తయ్యే వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది.

తప్పుడు పనులు చేసే, లేదా ఇతరులను అవమానించే వ్యక్తులకు దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. లేకుంటే మీరు వారికి ఎప్పుడు బలి అవుతారో కూడా మీకు తెలియదు. ఒకొక్కసారి మీ స్వంత ప్రతిష్టను కూడా దెబ్బతీస్తుంది.

మీరు ఎంత బలహీనంగా ఉన్నా, మీ బలహీనతను ఎప్పుడూ అవతలివారికి తెలిసేలా ప్రవర్తించకూడదు. పాములాగా, అది విషపూరితం కానప్పటికీ..  బుసలు కొట్టడం ఆపదు.

Also Read:

 కొత్త ఏడాది ఈ రాశివారికి కుజుడు ఆర్ధిక, సుఖ సంతోషాలను ఇస్తాడు.. అందులో మీరున్నారా తెలుసుకోండి..

నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
నవ వధువును చిదిమేసిన వరకట్న పిశాచి..వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ