Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురు సీరియస్
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవగా, మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు.
Reniguta Road Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలవగా, మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. రేణిగుంట మండలం కుక్కలదొడ్డి వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. రేణిగుంట నుండి రైల్వే కోడూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని కారు డీకొట్టింది. లారీని ఓవర్టేక్ చేయబోయి కారు మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులను కడప జిల్లా రాజంపేట మండలం చెర్లోపల్లి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మయ్య(40), నరసమ్మ(60)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Soumya Swaminathan: ఓమిక్రాన్ కట్టడికి అదొక్కటే మార్గం.. కీలక ప్రకటన చేసిన WHO చీఫ్ సైంటిస్ట్!