Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పబ్ ఓనర్లకు సీపీ స్టీఫెన్ రవీంద్ర స్ట్రైయిట్ వార్నింగ్.. రాత్రి 10 తర్వాత మ్యూజిక్ బంద్

ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకనుంచి మరో లెక్క. పబ్‌ ఓనర్లకు గట్టి హెచ్చరిక చేశారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర. రూల్స్ బ్రేక్ చేస్తే యాక్షన్‌ తప్పదంటూ సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారాయన.

Hyderabad: పబ్ ఓనర్లకు సీపీ స్టీఫెన్ రవీంద్ర స్ట్రైయిట్ వార్నింగ్.. రాత్రి 10 తర్వాత మ్యూజిక్ బంద్
Cyberabad Cp Stephen Raveendra
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 24, 2022 | 7:35 PM

Telangana: పబ్‌ ఓనర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్ రవీంద్ర. రాత్రి 10గంటల తర్వాత సౌండ్‌ బయటకు రావొద్దని సూచించారు. హైకోర్టు ఆదేశాలను కచ్చితంగా పాటించి తీరాలన్నారు సైబరాబాద్ సీపీ. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీరియస్ అయ్యారు. ఇదీ హైదరాబాద్ పబ్ కల్చర్ కి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్. ఇప్పటికే పబ్ కల్చర్ పట్ల జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ పబ్లిక్ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. వీళ్ల వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ ల పేరిట ఎన్నో యాక్సిడెంట్లు జరిగాయి. ప్రాణనష్టం సైతం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇవన్నీ అలా ఉంచితే.. పబ్బులున్న చోట్ల.. ట్రాఫిక్ జామ్ కామన్ అయ్యింది. రోడ్ల మీదే తాగడం.. ఇష్టారాజ్యం ప్రవర్తన. వీటన్నిటిపై ఇప్పటికే విసిగి వేసారి పోయారు జూబ్లీహిల్స్ వాసులు. ఎన్నోసార్లు కంప్లయింట్ చేసి.. పోలీసుల మీదా అనుమానం పెంచేసుకున్నారు. వీళ్ల కనుసనల్లోనే ఇలా జరుగుతోందన్న నిర్ణయానికి వచ్చేశారు. ఇవే అనుకుంటే.. వీటి ద్వారా భారీ ఎత్తున సౌండ్ పొల్యూషన్. చుట్టు పక్కల ప్రాంతాల్లో నివసించే బడాబాబులకు మనశ్శాంతి లోపం. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్.. ఇళ్లు తీసుకునేదే ప్రశాంతత కోసం. అలాంటి ప్రశాంత వాతావరణం దెబ్బ తినేలా- ఇక్కడి పబ్బుల నిర్వహణ తీవ్ర ఇబ్బందికరం. అభ్యంతరకరం. ఎన్ని కంప్లయింట్లు వెళ్లినా పబ్బుల నిర్వహణ విషయంలో ఎలాంటి మార్పుల్లేవు. ఎప్పటిలాగే అన్ టైమింగ్స్. అన్ వాంటెడ్ న్యూసెన్స్. రాత్రింబవళ్లు- ఒకటే నాయిస్.

ఈ పొల్యూషన్ భరించలేక పోలీసులపై మరింత ఒత్తిడి తెచ్చిన ఫలితం.. ఇదిగో పబ్బు ఓనర్లందర్నీ పిలిచి- మీటింగ్ పెట్టి గట్టి వార్నింగ్ ఇచ్చారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. రాత్రి పది దాటాక చిన్న సౌండ్ వచ్చినా.. బెండు తీస్తామని హెచ్చరించారు. హైకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని సీరియస్ అయ్యారు. మరి చూడాలి.. ఇక నుంచైనా.. పబ్బు గబ్బు కంట్రోల్ లోకి వస్తుందో రాదో.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..