Telangana: కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారమా..? ఉత్తమ్‌ ఫిర్యాదుతో పోలీసుల దూకుడు..

తెలంగాణ కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్‌ పోలీసులు ముందు హాజరయ్యారు. ఈ నెల 19న మళ్లీ రావాలని చెప్పి పంపించారు పోలీసులు. ఉత్తమ్‌పై దుష్ప్రచారం చేస్తున్నదెవరో తేల్చే పనిలో పడ్డారు దర్యాప్తు అధికారులు.

Telangana: కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారమా..? ఉత్తమ్‌ ఫిర్యాదుతో పోలీసుల దూకుడు..
Uttam Kumar Reddy
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2023 | 8:41 PM

టీపీసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు టీ కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. ఉత్తమ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్‌పై ఫిర్యాదు చేయడంతో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సీన్‌లోకి వచ్చారు. సమస్య అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్‌ వార్‌ రూమ్‌ వైపు మళ్లడంతో మరింత ఉత్కంఠ రేగింది. టీకాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌గా ఉన్న ప్రశాంత్‌పై అందరి దృష్టీ పడటంతో వెంటనే ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించింది పీసీసీ. ఇప్పటికే యూత్ కాంగ్రెస్ ఆఫీస్ వార్‌ రూమ్‌లో సీసీఎస్ పోలీసుల దాడులు చేసి కంప్యూటర్లు సీజ్‌ చేశారు. ప్రశాంత్‌కు 41A నోటీసులు ఇవ్వడం.. అతను ఆచూకీ లేకపోవడంతో రకరకాలుగా ప్రచారం జరిగింది. ప్రశాంత్‌ ఎట్టకేలకు సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే 19న రావాలని చెప్పారు పోలీసులు.

కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారమా..?

తాను ఎక్కడికి పారిపోలేదని.. ఇది కాంగ్రెస్‌ అంతర్గత వ్యవహారంగా చెప్పుకొచ్చారు ప్రశాంత్‌. చిన్న సమస్యే అయినా.. కావాలని పెద్దది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే ప్రశాంత్‌ పోలీసుల ముందుకు రావడంతో.. ఈ కేసులో ఏం జరుగుతుంది? కుట్ర ఉందా..? లేక ప్రశాంత్‌ చెబుతున్నట్టు పొరపాటుగా పోస్టింగ్‌ పెట్టారా అనేది ఇంకా తేలాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..