Praneeth Hanumanthu: ‘తప్పైంది.. క్షమించండి..’ వీడియో విడుదల చేసిన ప్రణీత్

ప్రణీత్ హనుమంతు.. మితిమీరి ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో భగ్గుమన్న విషయం తెలిసిందే. అతని వల్గర్ కామెంట్స్‌పై తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కూడా స్పందించారు. దీంతో ప్రణీత్ బహిరంగా క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు.

Praneeth Hanumanthu: 'తప్పైంది.. క్షమించండి..' వీడియో విడుదల చేసిన ప్రణీత్
Praneeth Hanumanthu
Follow us

|

Updated on: Jul 08, 2024 | 4:36 PM

డార్క్ కామెడీ పేరుతో యూట్యుబర్‌ ప్రణీత్‌ విచ్చలవిడి కామెంట్స్‌పై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. టీవీ9 కథనాలతో యూట్యూబర్‌ ప్రణీత్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హీరో సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌తో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. పిల్లల రక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు.. దిగొచ్చాడు. హద్దు దాటానని.. క్షమాపణలు చెప్పాడు. గత రెండు రోజులుగా తన పేరెంట్స్‌ను చాలామంది బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వదలేయాలని తప్పంతా తనదే అన్నాడు ప్రణీత్. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి ప్రణీత్ నుంచి ఎవరూ క్షమాపణలు ఆశించడం లేదు. ఆయన ఆలోచన విధానం మారాలంటున్నారు. తండ్రీ కూతురుపై ఇంత వల్గర్‌గా మాట్లాడటం అంటే అతని మైండ్‌సెట్‌ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు. ప్రణీత్ లాంటి వాళ్లపై కఠినచర్యలు తీసుకుంటేనే మరోసారి ఇంకెవరూ ఇలా ప్రవర్తించకుండా ఉంటారని అంటున్నారు.

ఓ తండ్రి తన కూతురితో కలిసి సరదాగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యుట్యూబర్ ప్రణిత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. తండ్రీ కూతుళ్ళ బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయి ధరమ్ తేజ్ రియాక్ట్‌ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లలని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో చేసినవారు సమాజానికి ప్రమాదకరం.. అంటూ మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్ వంటి హీరోలు సైతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్నారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ బ్యూరో ప్రణీత్ హనుమంతుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసింది. లేటెస్ట్‌గా టీవీ9 కథనాలతో ప్రణీత్ సారీ చెప్పాడు.

గత కొంతకాలంగా యూట్యూబ్‌ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు ప్రణీత్ హనుమంతు. తన వ్యాఖ్యలు శృతిమించి.. ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహాన్ని చవి చూస్తున్నాడు. ఐఎఎస్ అధికారి హనుమంతు అరుణ్‌కుమార్‌ కుమారుడే ప్రణీత్.  సుధీర్ బాబు హీరోగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంతు నటించాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..