Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ దారుణం.. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య.. ఆరేళ్ల చిన్నారి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..

బాధ్యతయుతమైన ఉద్యోగంలో ఉండి తన భార్య, పిల్లలు పైన కర్కశంగా వ్యవహరించిన ఓ కానిస్టేబుల్ బాగోతం బయట పడింది. తను పెళ్లాడిన భార్య లావు గా..

హైదరాబాద్ దారుణం.. కానిస్టేబుల్ వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య.. ఆరేళ్ల చిన్నారి చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..
Student Suicide
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 10, 2021 | 9:58 PM

బాధ్యతయుతమైన ఉద్యోగంలో ఉండి తన భార్య, పిల్లలు పైన కర్కశంగా వ్యవహరించిన ఓ కానిస్టేబుల్ బాగోతం బయట పడింది. తను పెళ్లాడిన భార్య లావు గా ఉందనే కోపంతో భార్యను వేధింపులకు గురిచేసిన ఘటన అందరిని షాక్‌కు గురి చేసింది. ఇక భార్య ను నిర్లక్ష్యం చేస్తూ చిన్న నాటి స్నేహితురాలైన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అలా ఆ కీచక కానిస్టేబుల్ వేధింపుల మధ్య నలిగిపోయిన అతని భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కానిస్టేబుల్ శివకుమార్‌కు కొంతకాలం క్రితం పెళ్లి అయ్యింది. వీరికి పిల్లలు కూడా ఉంది. అయితే, తన భార్య చూడటానికి లావుగా ఉందనే కోపంతో నిత్యం ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. అలా ఇద్దరి మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇంటికి రాగానే ఎదో ఒక విషయంలో గొడవ పెట్టుకోవడం.. భార్యతపై దాడి చేయడం పరిపాటిగా మారిపోయింది. ఈ గొడవలో అడ్డొచ్చిన పిల్లలపైనా దాడి చేసేవాడు.

భర్త శివ కుమార్ వేధింపులు తాళలేక భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువులో దూకి ఇటీవల అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా.. శివకుమార్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేల్చారు. ఆ కారణంగానే.. ఇంట్లో కుటుంబ కలహాలు వచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. శివ కుమార్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. కొన్ని నెలలు క్రితం పూర్వ విద్యార్థుల సమావేశం జరిగిన సమయంలో చిన్ననాటి స్నేహితురాలైన మరో వివాహితతో శివకుమార్‌కి పరిచయం అయ్యిందని, ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసిందని ఆమె ఆరోపించారు. ఈ విషయం తెలిసిన తన కూతురు తీవ్ర మనస్తాపానికి గురైందన్నారు. కాగా, తన కూతురుని చంపేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మంచి కట్న కానుకలిచ్చి పెళ్లి చేసినా వేధింపులు ఆగడం లేదని, తన కూతురు ని హత్య చేశారని వారు ఆరోపించారు.

కన్నీరు పెట్టిస్తున్న చిన్నారి మాటలు.. ఇదిలాఉంటే కానిస్టేబుల్ శివ అరాచకాలను అతని ఆరేళ్ల కూతురు కళ్లకు కట్టినట్లు వివరించింది. తన తల్లిని దారుణంగా చిత్రహింసలకు గురిచేసేవాడంటూ బోరున విలపించింది ఆ చిన్నారి. ‘అమ్మను ప్రతి రోజూ కొట్టేవాడు. అన్నం కూడా పెట్టకుండా వేధించేవాడు. బయటి నుంచి కోపంతో వచ్చి మా పైనా, అమ్మ పైనా దాడి చేసేవాడు. అమ్మకి, మాకు కరెంట్ షాక్ కూడా పెట్టేవాడు. గట్టిగా ఏడిస్తే డాడీ మరింత కొట్టేవాడు’ అంటూ తన తండ్రి కానిస్టేబుల్ శివ కుమార్ చేసిన అరాచకాలను ఆ చినార్ని వివరించింది. ఈ చిన్నారి మాటలు వింటే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ఇంతటి క్రూరుడైన శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి బంధువులు సహా, స్థానికులు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు.

Also read:

Benefits of Tomato juice: ఈ అనారోగ్య సమస్యలన్నింటికీ ‘టమాట’తో చెక్ పెట్టండి.. ప్రతిరోజూ జ్యూస్ తాగితే..

Khattar No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. బలపరీక్షలో నెగ్గిన సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్..