Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khattar No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. బలపరీక్షలో నెగ్గిన సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్..

Haryana Assembly: హర్యానా అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా 55 ఓట్లు రాగా..

Khattar No Confidence Motion: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం.. బలపరీక్షలో నెగ్గిన సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్..
khattar govt defeats
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 10, 2021 | 9:40 PM

No Confidence Motion: హర్యానా అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు సీఎం మనోహర్‌లాల్‌ కట్టర్‌. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ప్రభుత్వానికి మద్దతుగా 55 ఓట్లు రాగా , వ్యతిరేకంగా కేవలం 32 ఓట్లు మాత్రమే రావడంతో కట్టర్‌ సర్కార్‌ బలపరీక్షలో గెలిచింది. రైతుల ఆందోళను కట్టర్‌ ప్రభుత్వం అణచివేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని పెట్టింది.

అయితే కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కట్టర్‌. ప్రభుత్వంపై ప్రతి ఆరునెలలకోసారి అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చని సవాల్‌ విసిరారు. రైతులకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉందన్నారు. హర్యానా అసెంబ్లీలో 90 స్థానాలుండగా .. బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేల సపోర్ట్‌ ఉంది.

మెజారిటీ మార్క్‌కు 45 మంది ఎమ్మెల్యేల అవసరం కాగా సంకీర్ణ ప్రభుత్వం 55 ఓట్లతో గట్టెక్కింది.. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్‌ సర్కార్‌ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్‌ సింగ్‌ హుడా అరోపించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్‌ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.

భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా ఆరోపించారు.

ఇవి కూడా చదవండి..

జస్‌ప్రీత్ బుమ్రా కంటే ముందు.. యాంకర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు… ఎవరో తెలుసా.. అయితే చూడండి..!

ఈ ఇంటి ఖరీదు రూ. 6.5 కోట్లు … కానీ బాత్రూమ్‌కు డోర్ లేదు.. ప్రత్యేకత ఏంటో తెలుసా..