AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: పోలీసు అధికారికి చెక్కిలిగింతలు.. వ్యాక్సిన్ కేంద్రంలో నవ్వులే నవ్వులు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..

Covid Vaccine: కొంతమందికి శరీరంలోని కొన్ని భాగాల్లో టచ్ చేస్తే చెక్కిలిగింతలు పెట్టినట్లుగా అనిపిస్తుంటుంది. కొందరికి ఆ స్పర్శ..

Covid Vaccine: పోలీసు అధికారికి చెక్కిలిగింతలు.. వ్యాక్సిన్ కేంద్రంలో నవ్వులే నవ్వులు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..
Shiva Prajapati
|

Updated on: Mar 10, 2021 | 10:37 PM

Share

Covid Vaccine: కొంతమందికి శరీరంలోని కొన్ని భాగాల్లో టచ్ చేస్తే చెక్కిలిగింతలు పెట్టినట్లుగా అనిపిస్తుంటుంది. కొందరికి ఆ స్పర్శ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి, మరికొందరికి తక్కువగా ఉంటాయి. అయితే నాగాలాండ్‌కు చెందిన ఓ పోలీసు అధికారికి ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువే చెక్కిలిగింతలు ఉన్నట్లున్నాయి. ఆ చెక్కిలిగింతల కారణంగా తాను నవ్వుకోవడమే కాకుండా.. తన చుట్టూ ఉన్న వారిని కడుపుబ్బా నవ్వించాడు. ఇప్పుడు నెటిజన్లను సైతం నవ్విస్తున్నాడు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. నాగాలాండ్‌ రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో దశ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, ఓ పోలీసు అధికారి కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవడానికి వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చాడు. అప్పుడే అసలు కథ స్టార్ట్ అయ్యింది. సదరు పోలీసు అధికారిని ఎవరైనా ముట్టుకుంటే చెక్కిలిగింతలు కలుగుతాయట. మరి ముట్టుకోకుండా సూది వేయడం సాధ్యమేనా? కాదు కదా. ఇంకా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఫుల్ షర్ట్ వేసుకున్నట్లయితే, షర్ట్ విప్పాల్సి ఉంటుంది. ఆ పోలీస్ అధికారి తన షర్ట్‌ను ఒక భాగం తీసేసి ఇంజక్షన్ వేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. అంతలో ఓ మహిళా నర్సు ఆ పోలీస్ అధికారికి సూది వేసేందుకు దగ్గరకు వచ్చింది. కాటన్(దూది)తో అతని చేతిని తాకింది. ఇంకేముందు.. ఆ పోలీసు అధికారి తెగ మెలికలు తిరిగిపోతూ నాన్‌స్టాప్‌గా నవ్వాడు.

నర్సు చేయి టచ్ అయితే చాలు పడిపడి నవ్వుతున్నాడు. పక్కన మరో నర్సు అతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ అతను మాత్రం నవ్వుతూనే ఉన్నాడు. చెక్కిలిగింతలు అవుతుందంటూ ఊగిపోయాడు. చివరికి అతన్ని కంట్రోల్ చేయడానికి మరో పోలీసు అధికారి కూడా రంగంలోకి దిగాడు. అందరూ కలిసి అతన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. చివరికి అందరూ తీవ్రంగా శ్రమించి ఆ పోలీసు అధికారికి టీకా ఇచ్చి హమ్మయ్య అనుకున్నారు. అయితే, పోలీసు అధికారి చెక్కిలిగింతలకు సంబంధించి వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రుపిన్ శర్మ ట్వీట్ చేశారు. ‘నాగాలాండ్‌కు చెందిన ఈ పోలీస్‌ మొత్తానికి వ్యాక్సిన్‌ తీసుకున్నాడో లేదో తెలియదు గానీ.. అతడిని సూది కంటే చక్కిలిగింతలే ఎక్కువగా కలవరపెడుతున్నాయి’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. ఐపీఎస్ ఈ వీడియోను ట్వీట్ చేయడంతో అది కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు సైతం తెగ నవ్వుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోనూ మీరూ చూసేయండి.

IPS Officer Tweet:

Also read:

నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలు.. హవాయిని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐలండ్ స్టేట్..

విరిగిన యాగంటి బసవన్న ఆలయంలోని రాతి దూలం.. ఆందోళనల్లో భక్తులు.. పరిశీలించిన ఆర్కియాలజిస్టులు