Rahul Sipligunj: ఎన్నికల బరిలోకి RRR ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడంటే..?

Rahul Sipligunj: బిగ్‌బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి వివాదంతో కాదు రాజకీయ గుస గుసలతో రాహుల్ సిప్లిగంజ్ వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజిని పోటీలో నిలపాలని..

Rahul Sipligunj: ఎన్నికల బరిలోకి RRR ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్.. ఎక్కడి నుంచి పోటీ చేయనున్నాడంటే..?
Rahul Sipligunj with TPCC Chief Revanth Reddy
Follow us
Vijay Saatha

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Aug 04, 2023 | 7:24 PM

Rahul Sipligunj: మంగళహాట్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలో వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. బిగ్‌ బాస్ విన్నర్‌గా, ఆస్కార్ స్టేజ్ ఫేమర్‌గా పేరొందిన రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి వివాదంతో కాదు రాజకీయ గుస గుసలతో రాహుల్ సిప్లిగంజ్ వార్తల్లో నిలుస్తున్నారు. త్వరలో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజిని పోటీలో నిలపాలని హస్తం పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ మంగళహాట్ పొరగాడు హైదరాబాదులో పక్క మాస్ ప్లేస్ మంగళహాట్‌లో జన్మించాడు.  మంగళ్ హాట్ గోషామహల్ నియోజకవర్గంలో ఉంది. లోకల్ అయిన రాహుల్ సిప్లిగంజిని తమ పార్టీ నుంచి పోటీ చేపిస్తే బలమైన అభ్యర్థిగా నిలుస్తాడని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ మధ్యకాలంలో రాహుల్ గోషామహల్ నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతుండడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది.

బోనాల పండగలో రాహుల్ హల్చల్..!

ఇటీవల జరిగిన బోనాల పండుగ సమయంలో రాహుల్ సిప్లిగంజ్ పెద్ద ఎత్తున గోషామహల్ గల్లీలో దావతులకి అటెండ్ అయినట్టుగా తెలుస్తోంది. వరుస వివాదాల్లో ఉన్న రాహుల్ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడితో గొడవ తర్వాత తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్‌గా గెలిచాడు. అలాగే ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ నటించిన RRR సినిమా ద్వారా మరొకసారి ప్రపంచవ్యాప్తంగా రాహుల్ ఫేమ్ అయ్యాడు. ఇంకా RRR సినిమాకి ఆస్కార్ రావడంతో ఆ పాట ఆస్కార్ స్టేజి మీద పర్ఫామ్ చేసే అవకాశం రాహుల్‌కు వచ్చింది. అలా రాహుల్ పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయింది. ఈ కారణంగానే మాస్ నుంచి వచ్చి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రాహుల్ సిప్లిగంజిని గోషామహల్ నుంచి పోటీ చేపిస్తే గట్టి పోటీని ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ పార్టీని అనుకుంటుంది. అందులో భాగంగానే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ సిప్లిగంజిని పోటీ చేపిస్తే బాగుంటుందని పలువురు రాహుల్‌కి చెప్పడంతో తాను కూడా లోకల్ గా మాట్లాడిన తర్వాత తన నిర్ణయం చెప్తానంటూ చెప్పినట్టుగా సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..