Hyderabad: గే డేటింగ్ యాప్‌లో కనెక్ట్ అయిన వ్యక్తి రూమ్‌కి వెళ్లారు.. కట్ చేస్తే అంతా ఖల్లాస్
ఒక రోజు రెండు వేరు, వేరు ఘటనల్లో ఇదర్ని ఇలా మోసం చేశాడు. బంజారాహిల్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అఫ్రిదీగా గుర్తించి.. అతడి కోసం గాలింపు షురూ చేశారు. బయటకు చెప్తే.. తమ వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. నిందితుడు అఫ్రిదిపై గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రజంట్ అతడి కోసం గాలింపు షురూ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 4: భయ్యా జాగ్రత్త.. ఇదో కొత్త తరహా మోసం.. డేటింగ్ యాప్స్ ద్వారా పరిచయం అయ్యే వాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. లేదంటో నిలువునా మోసపోయే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో తాజాగా అలాంటి ఇన్సిడెంటే జరిగింది. స్వలింగ సంపర్కుల కోసం Grindr యాప్ ఒకటి ఉంది. ఇది జనాల్లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న యాప్. స్వలింగ సంపర్కులకు సంబంధించిన యాప్ కావడంతో.. ఇక్కడ చాట్ చేసేవారు.. దీని ద్వారా కలిసేవారు చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. సొసైటీలోని తన ప్రొఫైల్‌ను బయట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. దీన్నే అస్త్రంగా మలుచుకున్నాడు ఓ ప్రబుద్దుడు. గే డేటింగ్ అప్లికేషన్ Grindr ద్వారా ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ట్రాప్ చేశాడు. వారిని రూమ్‌కి పిలిచి.. న్యూడ్‌గా ఉన్న వీడియోలు రికార్డ్ చేసి.. ఆపై బెదిరింపులకు పాల్పడి.. డబ్బు, బంగారం దోచుకుంటున్నాడు. ఎందుకు వీడియోస్ తీస్తున్నావని అడిగిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని కత్తితో బెదిరించాడు కూడా.
ఒకే రోజు రెండు వేరు, వేరు ఘటనల్లో ఇదర్ని ఇలా మోసం చేశాడు. బంజారాహిల్స్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడ్ని అఫ్రిదీగా గుర్తించి.. అతడి కోసం గాలింపు షురూ చేశారు. బయటకు చెప్తే.. తమ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లు బాధితులు వాపోయారు. నిందితుడు అఫ్రిదిపై గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. ప్రజంట్ అతడి కోసం గాలింపు షురూ చేశారు. ఇలాంటి కేసుల్లో పరువు పోతుందని బాధితులు చాలా అరుదుగా కంప్లైంట్ చేస్తారని.. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా మోసపోతే.. తమ వద్దకు వచ్చి కంప్లైంట్ చేయాలని.. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు.. వారికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి.. కేటుగాళ్లను కటకటాల వెనక్కి పంపుతామని చెబుతున్నారు.
ఇదే కాదు ఈ డేటింగ్ యాప్స్ ద్వారా చాలా రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. డేటింగ్ యాప్‌ల ట్రాపింగ్ అట్లుంటది. తెలిసో తెలియకో.. తెలుసుకుందామనే ఉత్సుకతో కానీ ఓ అంకుల్ డీప్‌గా డేటింగ్ యాప్ ట్రాప్‌లో పడ్డారు. ఆయన సాదాసీదా మనిషి కాదు. ఇనుము అయస్కాంతంలో అతుక్కుపోయే వయసు కాదు. కానీ మనసు మాత్రం డేటింగ్‌పై లాగేసింది. డాక్టర్‌గిరిలో ఎంతో సిన్సియార్టీ, వృత్తి పట్ట సిన్సియార్టీ వున్న ఆ పెద్దాయన పోయి పోయి డేటింగ్ మాఫియా వలకు చిక్కారు. చాటింగ్‌లో కరెంట్ తీగలాంటి ఓ వయ్యారి భామ కనెక్టయింది. బాత్ చీత్‌తో నగదు బట్వాడా స్కీమ్ బోర్డర్ దాటింది. తాను స్కామ్‌లో ఇరుక్కున్నాని పసిగట్టలేదు. వయసుది ఏముంది గురూ.. మనుసులో ఎలాంటి అలజడి రేగిందో కానీ అడిగినకొద్దీ డబ్బు పంపుతా పోయాడు. కట్ చేస్తే కోటిన్నర హాంఫట్. మాట ముచ్చటే తప్ప మరే కార్యానికి ఆస్కారం లేకుండా కోటిన్నర టోకర. బురిడీ కొట్టించింది అందాల భామ కాదు. కొందరు ఖతర్నాక్ కేటుగాళ్లు. యువతుల ఫోటోలను పెట్టి.. వాయిస్ ఇమిటేట్ చేసి డాక్టర్‌గారి ఖాతాల్ని ఖాళీ చేశారు. ఇలాంటి మోసాలు ఇప్పుడు నిత్యకృత్యమయ్యాయి. అలెర్ట్‌గా లేకపోతే ఖేల్ కతం. బీ కేర్‌ఫుల్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..