ఈనెల 31లోపు పూర్తి చేయండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ఈనెల 31లోపు పూర్తి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శకులకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులతో..

ఈనెల 31లోపు పూర్తి చేయండి.. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును ఈనెల 31లోపు పూర్తి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శకులకు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రగతి భవన్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో సమావేశం అయ్యారు. పార్టీ సభ్యత్వం నమోదుపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. హైదరాబాద్‌ పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొద్దిపాటిగా కష్టపడితే పార్టీకి మరింత బలం పెరుగుతుందని ఆయన అన్నారు. కార్యకర్తల ప్రమాద బీమా ఈనెలాఖరుతో ముగుస్తున్నందున ఆగస్టు 1 నుంచి కొత్త సభ్యత్వాల ప్రకారం బీమా కల్పించాలని సమావేశంలో నిర్ణయిచారు. ఆగస్టు 1న బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించెలా కార్యాచరణ రూపొందించారు. ఇప్పటి వరకు సుమారు 50 వేల సభ్యత్వాల డిజిటలీకరణ పూర్తయిందని, మిగతావి ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఆగస్టు 1న మరోసారి సమావేశం నిర్వహించుకుందామని కేటీఆర్‌ తెలిపారు.

ఇవీ కూడా చదవండి

BJP in South India : అంతుచిక్కని ఓటరునాడి.. కమలనాథులకు దక్కని దక్షిణాది!

Devineni Uma: మాజీ మంత్రి దేవినేని ఉమా వాహనంపై వైసీపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం

 

Click on your DTH Provider to Add TV9 Telugu