AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సిటీలో కమెడియన్‌ డేనియల్ ఫెర్నాండేజ్ షో రద్దు.. రాజాసింగ్ హెచ్చరికలతో

స్టాండప్ కమెడియన్ డేనియల్‌ ఫెర్నాండెజ్‌ హైదరాబాద్‌లో తన షోని రద్దు చేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ బెదిరింపులతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Hyderabad: సిటీలో కమెడియన్‌ డేనియల్ ఫెర్నాండేజ్ షో రద్దు.. రాజాసింగ్ హెచ్చరికలతో
Comedian Daniel Fernandes
Ram Naramaneni
|

Updated on: Jun 30, 2024 | 8:19 PM

Share

హైదరాబాద్‌లో ప్రముఖ స్టాండప్ కమెడియన్ డేనియల్ ఫెర్నాండెజ్ కామెడీ షో క్యాన్సిల్ అయింది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఈ షో రద్దుచేసుకున్నారు. హైదరాబాద్ లో డేనియల్ ఫెర్నాండెజ్ షో నిర్వహించాలని భావించారు. అంతేకాదు టికెట్లు సైతం విక్రయించారు. అయితే ఇటీవల జైనులను ఉద్దేశించి డేనియల్ ఫెర్నాండెజ్ చేసిన కామెడీ వీడియో వివాదాస్పదంగా మారింది. బక్రీద్ రోజు జైనులు మేకలను కొనుగోలు చేశారని తన షోలో చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ షో కోసం డేనియల్ హైదరాబాద్‌కు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్‌ ఇచ్చారు. గతంలో మునావర్ ఫరూఖీ విషయంలో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలని హిందువులు, జైనుల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణకు రావాలంటే 50 సార్లు ఆలోచించాలంటూ ఓ వీడియోను రాజాసింగ్ రిలీజ్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో డేనియల్ ఫెర్నాండెజ్‌ తన షో క్యాన్సిల్ చేసుకున్నారు.

కమెడియన్లను రాజాసింగ్ బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కామిక్ మునావర్ ఫారూఖీ ప్రదర్శనను హైదరాబాద్‌లో రద్దు చేయాలని రాజాసింగ్‌ హెచ్చరించారు. అయితే గట్టి భద్రతో అప్పటి ప్రభుత్వం మునావర్‌ షోను నిర్వహించింది. ఈ క్రమంలో మహమ్మద్‌ ప్రవక్తపై రాజాసింగ్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పాసింగ్‌ చేస్తూ వీడియో రిలీజ్‌ చేయడం అల్లర్లకు దారి తీసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్