ప్రాజెక్ట్‌ల బాట.. నేడు ‘పాలమూరు’కు కేసీఆర్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు కేసీఆర్. మమబూబ్‌నగర్ జిల్లా జీవరేఖగా భావించే ఈ పథకం పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ అక్కడకు వెళ్లనున్నారు. ఈ ఉదయం 9.10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ఆయన బయలుదేరనున్నారు. అక్కడ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం […]

ప్రాజెక్ట్‌ల బాట.. నేడు ‘పాలమూరు’కు కేసీఆర్
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 1:29 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మరో ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు కేసీఆర్. మమబూబ్‌నగర్ జిల్లా జీవరేఖగా భావించే ఈ పథకం పనులను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ అక్కడకు వెళ్లనున్నారు. ఈ ఉదయం 9.10 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో ఆయన బయలుదేరనున్నారు.

అక్కడ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్, పంప్‌హౌస్‌ను పరిశీలించనున్నారు. అయితే వట్టెం, కర్వెన, ఏదుల, నార్లాపూర్ పనులు ఇప్పటికే 60శాతం పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తైతే.. ముందుగా రోజుకు టీఎంసీ నీళ్ల ఎత్తిపోసే పనులు పూర్తిచేసి, వరదల కాలంలో రోజుకు అదనంగా మరో టీఎంసీ ఎత్తిపోసుకుని, 100 రోజుల్లో 100 టీఎంసీలు ఎత్తిపోసి పదిలక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యం. ఇక పాలమూరు ద్వారా అప్పన్నపల్లి, భూత్పూరు సమీపంలో రెండు పెద్దకాల్వలు వస్తున్నాయని.. ఇవి పాలమూరు పట్టణానికి కొత్త అందాన్ని తీసుకువస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆ ఏర్పాట్లను మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్‌ బుధవారం పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కరివెన వద్ద హెలిప్యాడ్‌ స్థలంతోపాటు ప్రాజెక్టు వద్ద పరిస్థితిని శ్రీనివాస్ గౌడ్‌ సమీక్షించారు. అలాగే నాగర్‌కర్నూలు జిల్లాలోని వట్టెం, నార్లాపూర్‌లో మంత్రి నిరంజన్‌రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.