CM KCR- CM Jagan : జల వివాదం అనంతరం తొలిసారి కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్ తాజాగా హైదారాబాద్‌లో కలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం మనవరాలి వివాహాంలో ఇద్దరు సీఎం ఎదురుపడ్డారు.

CM KCR- CM Jagan : జల వివాదం అనంతరం తొలిసారి కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు
Cm Jagan Cm Kcr
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 21, 2021 | 2:47 PM

తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్ తాజాగా హైదారాబాద్‌లో కలుసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం మనవరాలి వివాహాంలో ఇద్దరు సీఎం ఎదురుపడ్డారు. ఇరువురు సీఎంలు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యి.. వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించించుకున్న ముఖ్యమంత్రులు.. పక్కపక్కనే కూర్చున్నారు. జలవివాదం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఇరువురు సీఎంలు కాసేపు మాట్లాడుకున్నారు. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. స్పీకర్ మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఏపీ సీఎం ఓఎస్‌డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఘనంగా జరిగింది.  కాగా సీఎంలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు, మంత్రులు కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.

కాగా ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు సీఎం జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు కూడా అంతేస్థాయిలో కౌంటర్స్ ఇస్తున్నారు. జల వివాదంపై అయితే ఏకంగా ప్రభుత్వాల మధ్య లేఖల యుద్దమే జరుగుతుంది. ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు తాజాగా కలవడం.. మాట్లాడుకోవడం.. ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: AP Floods: ఏపీలో తీవ్ర విషాదం.. 26 మందిని మింగేసిన చెయ్యేరు వాగు