Hyderabad: జస్ట్ రూ.200 కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు తీశారు.. పాపం రెండేళ్లు మృత్యువుతో పోరాడి..

జస్ట్‌ 200 రూపాయల కోసం గొడవ జరిగింది.. 20 మంది దాడిచేశారు. బాధితుడు రెండేళ్లూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరకం అనుభవించాడు. 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు.. అయినా.. ప్రాణం మాత్రం దక్కలేదు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో దాడికి గురైన క్యాబ్ డ్రైవర్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు.

Hyderabad: జస్ట్ రూ.200 కోసం గొడవ.. క్యాబ్ డ్రైవర్ ప్రాణాలు తీశారు.. పాపం రెండేళ్లు మృత్యువుతో పోరాడి..
Crime News
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 05, 2024 | 12:30 PM

జస్ట్‌ 200 రూపాయల కోసం గొడవ జరిగింది.. 20 మంది దాడిచేశారు. బాధితుడు రెండేళ్లూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరకం అనుభవించాడు. 2 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చికిత్స చేయించారు.. అయినా.. ప్రాణం మాత్రం దక్కలేదు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో దాడికి గురైన క్యాబ్ డ్రైవర్ చివరకు ప్రాణాలు కోల్పోయాడు. రెండేళ్లపాటు నరకయాతన అనుభవించాడు బాధితుడు. 2022 జూలైలో ఉప్పరపల్లిలో వివేక్‌ రెడ్డితో క్యాబ్‌ చార్జీ విషయంలో వివాదం తలెత్తింది. దీంతో వెంకటేష్‌ను వెంబడించి మరి దాడి చేసింది వివేక్‌రెడ్డి గ్యాంగ్‌. బాధితుడు వెంకటేష్ ఆస్పత్రికి తరలించేలోపే కోమాలోకి వెళ్లిపోయాడు. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వెంకటేష్ ప్రాణం దక్కలేదు. చివరకు నల్గొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండేళ్లు మృత్యువుతో పోరాడి క్యాబ్ డ్రైవర్ వెంకటేష్‌ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

ఉప్పరపల్లిలో ప్యాసింజర్ వివేక్ రెడ్డితో క్యాబ్ చార్జీ రెండు వందల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. 20 మంది యువకులు క్రికెట్ బ్యాట్స్, వికెట్స్, హాకీ స్టిక్స్‌తో వెంకటేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. వెంబడించి వెంబడించి మరి దాడి చేసింది వివేక్ రెడ్డి గ్యాంగ్. దీంతో వెంకటేష్‌ స్పాట్‌లోనే కుప్పకూలాడు.

అక్కడికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రంతా పోలీస్ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. దాడికి పాల్పడ్డ వివేక్ రెడ్డి గ్యాంగ్‌ను మాత్రం వదిలేశారు. తీవ్రగాయాల పాలైన క్యాబ్ డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించకుండా పోలీస్ స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. అతని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాని వెంకటేష్ అప్పటికే కోమాలోకి వెళ్లిపోయాడు.

అప్పటి నుంచి రెండేళ్లు నరకం అనుభవించాడు క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్. కుటుంబ సభ్యులు ఆస్తులన్ని అమ్మి చికిత్స చేయించినా ప్రాణం దక్కలేదు. నల్గొండలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఉన్న పొలాలను, బంగారాన్ని అమ్మి సుమారు రెండు కోట్లు ఖర్చుపెట్టినా వెంకటేష్ ప్రాణాలు దక్కలేదని మృతుడి కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. ఓ వైపు పోలీస్ జాబ్ కు ప్రిపేర్ అవుతూనే.. మరోవైపు క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ వెంకటేష్ కుటుంబాన్ని పోషించేవాడని.. కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..