AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మిస్ అయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి వారి అదుపులోనే ఉన్నారు..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరన్ చౌదరి మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుండి కనబడకుండా పోయిన శరణ్ చౌదరిపై భార్య అమూల్య మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన శరన్ చౌదరినీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది భార్య అమూల్య.

Hyderabad: మిస్ అయిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరణ్ చౌదరి వారి అదుపులోనే ఉన్నారు..
Sharan Chaudari
Peddaprolu Jyothi
| Edited By: Aravind B|

Updated on: Aug 22, 2023 | 9:35 AM

Share

హైదరాబాద్ న్యూస్, ఆగస్టు 22: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శరన్ చౌదరి మిస్సింగ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుండి కనబడకుండా పోయిన శరణ్ చౌదరిపై భార్య అమూల్య మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమైన శరన్ చౌదరినీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొంది భార్య అమూల్య. మాదాపూర్ లోని తన ఇంటి నుండి మధ్యాహ్నం బయటకు వెళ్లిన శరన్ చౌదరి కూకట్పల్లి కైతలాపూర్ వద్ద కారును అడ్డగించి తన భర్తతో పాటు కార్ డ్రైవర్ ను మరొక వ్యక్తిని తీసుకెళ్లినట్లుగా శరన్ చౌదరి భార్య అమూల్య చెబుతోంది.

మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో ఆందోళనకు గురైన అమూల్య పోలీసులను ఆశ్రయించింది. రెండు వారాల నుంచి శరణ్ చౌదరికి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు భార్యతో ఈ విషయాన్ని షేర్ చేసుకున్నట్లుగా ఆమె చెబుతుంది. కూకట్పల్లి నియోజకవర్గం లో రాజకీయంగా ఎదుగుతున్నాడని కక్షతో చేశారా లేక ఏదైనా కారణం ఉందా తమకు అర్థం కాని పరిస్థితులలో ఉన్నామంటూ శరన్ చౌదరి భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది ..

ఇదిలా ఉంటే శరణ్ చౌదరిని హైదరాబాద్ CCS లోని ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసు అధికారుల అదుపులో ఉన్నట్లు సమాచారం ఒకవేళ పోలీసుల అదుపులో శరన్ చౌదరి ఉంటే ఏ కేసులో తీసుకువెళ్లారు అన్న దానిపై రావలసిన స్పష్టత ఉంది. ఒకవైపు కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేశారని ఆరోపణ చేస్తూ ఉంటే మరోవైపు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం…ఈ అంశంపై పోలీసులు క్లారిటీ ఇస్తే తప్ప శరన్ చౌదరి నిజంగానే కిడ్నాప్కి గురయ్యాడా లేక పోలీసులే తీసుకువెళ్లారని దానిపై తెలియాల్సి ఉంది.. తన భర్తను తనకు చూపించాలని శరన్ చౌదరి భార్య అమూల్య అంటోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా బీజేపీ నేత శరణ్ చౌదరి మిస్సింగ్ కేసు ఇప్పుడు హైదరాబాద్‌లో కలకలంగా మారింది. సోమవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన శరణ్ చౌదరి ఆచూకి అప్పటి నుంచి కనిపించలేదు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కారులో ఆయన ఎక్కారు. ఆయనతో పాటు మరో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఆ వాహనం ఎక్కినట్లు సమాచారం. అయితే అదే సమయంలో ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవ్వగా, అది ఇప్పటి వరకు స్విచ్ ఆన్ కాలేదని తెలిసింది. ఆయనతో పాటు ఆయన కార్ డ్రైవర్, సహాయకుడి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో శరణ్ చౌదరి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు శరణ్ చౌదరి ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసు అధికారుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..