Telangana: తెలంగాణ ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఫిర్యాదు.. ఆ ఆదేశాలు ఇవ్వాలని కోరిన బండి సంజయ్

తెలంగాణ(Telangana) ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంపై కంప్లైంట్ ఇచ్చారు. రద్దు చేసిన...

Telangana: తెలంగాణ ప్రభుత్వంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ కి ఫిర్యాదు.. ఆ ఆదేశాలు ఇవ్వాలని కోరిన బండి సంజయ్
Bandi Sanjay
Follow us

|

Updated on: Jun 26, 2022 | 11:54 AM

తెలంగాణ(Telangana) ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేయకపోవడంపై కంప్లైంట్ ఇచ్చారు. రద్దు చేసిన 19 లక్షల రేషన్‌ కార్డులపై, కొత్త రేషన్‌ కార్డుల మంజూరుపై విధించిన నిబంధనలపై దర్యాప్తు జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌ కార్డులు మంజూరు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ(NHRC) ని విజ్ఞప్తి చేశారు. కొత్త రేషన్‌కార్డుల మంజూరుపై విధించిన నిషేధాన్ని వెంటనే తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 19 లక్షల రేషన్‌ కార్డులను రద్దు చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. కొత్త రేషన్‌ కార్డులకు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం 7 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు. జూన్‌ 2021 నుంచి కొత్త రేషన్‌ కార్డుల దరఖాస్తులను, మీ సేవ సెంటర్లు ఆమోదించడం లేదని, వీటిపై చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరారు.

కాగా.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​కు పెంచిన అదనపు భద్రతను పోలీసులు వెనక్కు తీసుకున్నారు. అగ్నిపథ్ ఆందోళనలు, జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ వరకు ఇటీవల బండి సంజయ్​కు ప్రస్తుతమున్న దానికి అదనంగా (1+5) రోప్ పార్టీ, ఎస్కార్ట్ వాహనం ఇచ్చారు. పెంచిన భద్రత ఒక్కరోజు అమల్లోకి రాగా.. మళ్లీ వెనక్కి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి