వాళ్లకు జన్మించడం.. నాపూర్వ జన్మసుకృతం
బసవతారకం హాస్పిటల్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ కోడెల, హాస్పిటల్ యాజమాన్యం హాజరయ్యారు. ముందుగా తల్లిదండ్రులకు పూలమాల వేసి నమస్కరించారు బాలకృష్ణ. అనంతరం కోడెల శివప్రసాద్, బాలకృష్ణ కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. రామారావు, బసవతారకం దంపతులకు కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. ఎంతో మంది ఈ హాస్పిటల్ కృషికి శ్రమించారన్నారు. కేన్సర్ వ్యాధి.. […]
బసవతారకం హాస్పిటల్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ కోడెల, హాస్పిటల్ యాజమాన్యం హాజరయ్యారు. ముందుగా తల్లిదండ్రులకు పూలమాల వేసి నమస్కరించారు బాలకృష్ణ. అనంతరం కోడెల శివప్రసాద్, బాలకృష్ణ కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. రామారావు, బసవతారకం దంపతులకు కొడుకుగా పుట్టడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. ఎంతో మంది ఈ హాస్పిటల్ కృషికి శ్రమించారన్నారు. కేన్సర్ వ్యాధి.. ఒక విచిత్రమైన వ్యాధిఅని.. అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కాన్సర్ రోగులకు బసవతారకం హాస్పిటల్ అత్యాధునికమైన వైద్య సదుపాయాలతో వైద్య సేవల్ని అందిస్తుందని పేర్కొన్నారు బాలకృష్ణ.