Hyderabad: హైదరాబాద్‌లో కొత్త అమెరికా కాన్సెలేట్ చూశారా.. ప్రారంభం ఎప్పుడంటే..?
హైదరాబాద్‌లో నిర్మించిన అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ నూతన కార్యలయాన్ని నిర్మించారు. భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించడమే ఈ కార్యాలయం ముఖ్య విధి. ప్రస్తుతం బేగంపేటలో...
హైదరాబాద్‌లో నిర్మించిన అమెరికా కాన్సులేట్ కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ నూతన కార్యలయాన్ని నిర్మించారు. భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను పర్యవేక్షించడమే ఈ కార్యాలయం ముఖ్య విధి. ప్రస్తుతం బేగంపేటలో ఉన్న అమెరికా కాన్యులేట్ త్వరలోనే హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన నూతన భవనంలోకి మారనుంది.
నానక్‌రామ్‌గూడాలో నిర్మించిన నూతన భవనంలో 2023, జనవరి తొలివారంలోనే యూఎస్ కాన్సులేట్ సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికా కాన్సులేట్ నూతన భవనాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 12.2 ఎకరాల్లో నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనానికి సుమారు 297 మిలియన్ డాలర్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఈ యూఎస్ కాన్సులేట్ ఆసియాలనే అతిపెద్దదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఈ నూతన ఆఫీస్‌లో వీసా దరఖాస్తుల కోసం 54 విండోలు పని చేయనున్నాయి. దీంతో వీసా సేవలు మరింత సులభం కానున్నాయి.
#Telangana is all set & proud to house Asia’s largest US Consulate in #Hyderabad. The consulate, which is the first US diplomatic office post Independence of India, will be operational by January 2023.@TelanganaCMO @KTRTRS pic.twitter.com/qLPVpxZTuF
— Telangana Digital Media Wing (@DigitalMediaTS) November 26, 2022
ఇదిలా ఉంటే అమెరికా వెళ్లాలనుకునే వారు వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూల కోసం కాన్సులేట్ కార్యాలయానికి వెళ్తారనే విషయం తెలిసిందే. 2008కి ముందు హైదరాబాద్‌లో అమెరాక కాన్సులేట్ లేదు. అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు కచ్చితంగా చెన్నై వెళ్లాల్సి వచ్చేది. దీంతో హైదరాబాద్‌లో అమెరికా కాన్యులేట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో అమెరికా కాన్యులేట్ కార్యకలాపాలు జరుపుకుంటున్న ఈ ఆఫీసును వచ్చే ఏడాది నూతన కార్యాలయంలోకి తరలించనున్నారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..