Telangana: గర్బిణులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ఇకపై ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా..
రాష్ట్రంలోని 44 ప్రభుత్వాస్పత్రులలో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
గర్భిణులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని 44 ప్రభుత్వాస్పత్రులలో 56 ఆధునిక టిఫా స్కానింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తల్లీబిడ్డా సంరక్షణకే సీఎం కేసీఆర్ సర్కార్ పెద్ద పీట వేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో ఈ టిఫా స్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేస్తున్నామని.. వీటి ద్వారా నెలకు 20 వేల మంది గర్భిణులకు స్కానింగ్ చేసే వెసులుబాటు ఉంటుందని అన్నారు.
సాధారణంగా గర్భిణులు ప్రైవేటు ఆసుపత్రులలో స్కానింగ్ చేయించుకోవాలంటే.. సుమారు రూ. 2-3 వేల ఖర్చు అవుతుంది. ఈ టిఫా స్కానింగ్ మిషన్ల రాకతో.. ఇక మీదట సర్కారీ ఆసుపత్రుల్లో ఉచితంగానే స్కానింగ్ చేయించుకోవచ్చు. కాగా, ఈ స్కానింగ్ మిషన్ల ద్వారా బిడ్డకు ఉన్న లోపాలను గర్భస్థ దశలోనే సులువుగా గుర్తించవచ్చని గైనకాలజిస్టులు చెబుతున్నారు. తద్వారా తగిన వైద్యాన్ని అందించే వీలు ఉంటుందని అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..