Lingojiguda Division: లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం… కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం జరగనున్న లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Lingojiguda Division: లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం... కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్
Lingojiguda Division By Poll
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 30, 2021 | 6:42 AM

Lingojiguda Division By Poll: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శుక్రవారం జరగనున్న లింగోజిగూడ డివిజన్‌ ఉప ఎన్నికకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఆకుల రమేష్ రెడ్డి అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ ఇవాళ పోలింగ్ నిర్వహిస్తోంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

జీహెచ్ఎంసీ పరిధిలోని18వ డివిజన్‌ వ్యాప్తంగా 24 ప్రాంతాల్లో 57పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 358మంది పోలింగ్‌ సిబ్బంది తమ విధులను నిర్వహించనున్నారు. వీరిలో 72మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 214మంది ఓపీఓలు, ఐదుగురు జోనల్‌ అధికారులు, రెండు ఫ్లైయింగ్‌ స్కాడ్‌, రెండు స్టాటిక్‌ సర్వేలైన్‌ టీమ్‌లు ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సరూర్‌నగర్‌ మెమోరియల్‌ హోంలో ఏర్పాటుచేసిన రిసెప్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు గురువారం ఎన్నికల సామాగ్రిని తరలించారు. పూర్తిగా కోవిడ్‌ నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎక్కడ అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

లింగోజిగూడ ఉప ఎన్నికల బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ నుంచి తప్పుకోవడంతో బీజేపీ నుంచి మందుగుల అఖిల్‌ పవన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి దర్పల్లి రాజశేఖర్‌ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా చాలిక చంద్రశేఖర్‌, జల్ల నాగార్జున, షేక్‌ ఫర్వేజ్‌ ఉన్నారు. కాగా, కరోనా వజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తిగా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి మాస్కులతో పాటు ఫేస్​ షీల్డ్​, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు.

Read Also…  Cage Culture: ఖర్చు తక్కువ.. ఆదాయం ఎక్కువ.. చేపల పెంపకంలో కేజ్ కల్చర్ పై కొత్త పాలసీ తీసుకురానున్న ఏపీ ప్రభుత్వం

Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం