రెండో పెళ్లికి రూ.10 లక్షలు ఖర్చు చేసిన తండ్రి.. కోర్టులో కేసు వేసి గెలిచిన 10 ఏళ్ల కొడుకు
సోషల్ మీడియాలో ఒక వింత వైరల్‌గా మారింది. ఇది ఒక అరుదైన, అసాధారణమైన వ్యాజ్యం..ఇంటర్‌నెట్ వేధికగా ప్రజల దృష్టిని ఆకర్షించింది. తండ్రిపై కేసు పెట్టిన కొడుకు విజయం సాధించాడు. 10ఏళ్ల కొడుకుకు న్యాయం చేసిన కోర్టు సంచలన తీర్పు చెప్పింది. తండ్రి రెండో పెళ్లి కోసం ఖర్చు చేసిన మొత్తం రూ.1,000,000 లు తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కేసు పూర్తి వివరాలు, మొత్తం వివాదం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఒక అసాధారణమైన కుటుంబ కోర్టు వివాదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వార్తలో నిలిచింది. చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని సేంజ్ఝౌ నగరంలో 10 ఏళ్ల బాలుడు తన తండ్రిపై న్యాయపోరాటానికి వెళ్లిన సంఘటన ఎంతో మందిని ఆశ్చర్యంలో పడవేసింది. ఈ బాలుడు తన తల్లి విడాకుల అనంతరం అతని లూనార్ న్యూ ఇయర్ (చైనా పండుగ) సందర్భంగా పొందిన గిఫ్ట్ మనీ అనగా, చారిత్రకంగా రకరకాల ఆత్మీయులిచ్చే రెడ్ ప్యాకెట్ డబ్బులు. ఈ మొత్తాన్ని తండ్రి రెండవ వివాహానికి ఖర్చు చేశాడని తెలుసుకుని కోర్టులో కేసు దాఖలు చేశాడు.
పోలీసు నివేదికల ప్రకారం, బాలుడు Xiaohui తన చిన్న మొత్తాలను సేవ్ చేసుకుని 82,750 యువాన్ (సుమారు రూ. 10 లక్షలు) పొగుచేసిన డబ్బును బ్యాంక్‌లో జమ చేశాడు. ఈ డబ్బులు సాధారణంగా కుటుంబాలు, బంధువులు పిల్లల విజయం, శుభాకాంక్షలు తెలియజేసే సందర్భాల్లో ఇస్తారు. ఆ డబ్బులు పిల్లవాడు సంబంధించిన వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడతాయి.
అయితే, ఈ చిన్నారి తండ్రి అతడి పొదుపు మొత్తం డబ్బును తన రెండవ పెళ్లి నిర్వహణ కోసం ఉపయోగించాడు. అది కూడా తన కుమారుడి అనుమతి లేకుండా. ఆ విషయం పిల్లవాడికి తెలిసింది. వెంటనే తండ్రిని నిలదీశాడు. డబ్బు తిరిగి ఇవ్వమని కోరాడు. కానీ, ఆ తండ్రి ఇవ్వలేదు.. నువ్వు పెద్దాయ్యాక ఇస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో ఆ చిన్నారి తండ్రి పై నాడాన్ కోర్టులో కేసు వేశాడు. తన డబ్బును తిరిగి ఇప్పించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో అది బాలుడి సొంత ఆస్తి అని తేల్చి చెప్పారు. అనుమతి లేకుండా ఖర్చు చేసిన తండ్రిని ఆ మొత్తం డబ్బు బాలుడికి తిరిగి చెల్లించాలనే తీర్పునిచ్చింది కోర్టు. అలాగే వడ్డీతో పాటు కూడా తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
ముఖ్యంగా కోర్టు చెప్పింది ఏమిటంటే.. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు ఇచ్చే డబ్బు అనేది ఆ పిల్లవాడి వ్యక్తిగత ఆస్తి.. నిజానికి కుటుంబ పెద్దలు దానిని వాడుకోవడం, లేదా వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. మిగతా ఏమాత్రమైన డబ్బు నిర్వాహకుడిగా తల్లిదండ్రులు పర్యవేక్షించొచ్చు కానీ వ్యక్తిగత ఖర్చులకు వినియోగించడం వీలు లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ఈ విషయం సోషల్ మీడియాలో కూడా యూజర్లను షాక్ అయ్యేలా చేసింది. చాలా మంది నెటిజన్లు చిన్నారి ధైర్యానికి ప్రశంసలు తెలియజేస్తున్నారు. కొందరు ఇది పిల్లల ఆస్తి హక్కుల పట్ల ప్రజల్లో అవగాహన కలిగిస్తోందని చెబుతున్నారు. మరికొందరు ఇలా అంటున్నారు.. తల్లిదండ్రులకు పిల్లల డబ్బును వారి అవసరాలకే ఉపయోగించండి..మీ వ్యక్తిగత ప్రయోజనాలకోసం కాదు అని సూచిస్తున్నారు.
ఈ కేసు పిల్లలు కూడా తమ ఆస్తులపై చట్టపరంగా హక్కులు కలిగి ఉన్నారన్న విషయం ప్రపంచానికి గుర్తు చేస్తోంది. అలాగే తల్లిదండ్రుల బాధ్యతలను కూడా స్పష్టంచేస్తోంది.




