AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ట్రిపుల్‌ వన్‌ జీవో ఎత్తివేతతో పండగ చేసుకుంటున్న గ్రామస్థులు.. దశబ్దాల కల నెరవేరిందంటూ..

ట్రిపుల్‌ వన్‌ జీవో ఎత్తివేతతో ఆ పరిధిలో గ్రామస్థులు పండగ చేసుకుంటున్నారు. రెండు దశబ్దాల కల నెరవేరిందంటూ బాణాసంచ కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్‌ జీవో ట్రిపుల్‌ వన్‌నె ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ట్రిపుల్‌ వన్‌ జీవో కోసం ఎదురు చూస్తున్న వారికి బిగ్ రిలీఫ్‌ లభించింది. జీవో ఎత్తివేత కోసం ఎన్నో పోరాటాలు. ఆ తర్వాత ఎత్తివేతకు కూడా ఆందోళనలు సాగాయి...

Hyderabad: ట్రిపుల్‌ వన్‌ జీవో ఎత్తివేతతో పండగ చేసుకుంటున్న గ్రామస్థులు.. దశబ్దాల కల నెరవేరిందంటూ..
Hyderabad
Narender Vaitla
|

Updated on: May 19, 2023 | 11:01 AM

Share

ట్రిపుల్‌ వన్‌ జీవో ఎత్తివేతతో ఆ పరిధిలో గ్రామస్థులు పండగ చేసుకుంటున్నారు. రెండు దశబ్దాల కల నెరవేరిందంటూ బాణాసంచ కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్‌ జీవో ట్రిపుల్‌ వన్‌నె ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ట్రిపుల్‌ వన్‌ జీవో కోసం ఎదురు చూస్తున్న వారికి బిగ్ రిలీఫ్‌ లభించింది. జీవో ఎత్తివేత కోసం ఎన్నో పోరాటాలు. ఆ తర్వాత ఎత్తివేతకు కూడా ఆందోళనలు సాగాయి. ఎట్టకేలకు లాభనష్టాలపై ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం ట్రిపుల్‌ వన్‌ జీవోను ఎత్తివేసింది. ఈ జీవో పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఇక అంతా ఓపెన్‌.

హైదరాబాద్‌లోని జంట జలాశయాల రక్షణ కోసం 1996 మార్చి 8న 111 జీవో తీసుకొచ్చింది. రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లి నియోజకవర్గాల్లో దాదాపు 10 కి.మీటర్ల రేడియస్‌ కలిగి ఉంది. 7 మండలాల్లో లక్షా 30 వేల ఎకరాల భూమి ఉంది. ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌ సాగర్ పరివాహక ప్రాంతాలను కాపాడడం కోసం జీవో తెచ్చారు. మొత్తం10 కి.మీటర్ల రేడియస్‌లో కాలుష్య కారక ఫ్యాక్టరీలు, హోటళ్లు నిర్మాణానికి వీలులేదు. క్యాచ్ మెంట్ ఏరియాలో వేసే లే ఔట్లలో 60 శాతం ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఇక భూమిలో 90 శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జీ ప్లస్‌ 2కి మించి నిర్మాణాలు చేపట్టరాదు. మొయినాబాద్‌, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల్లో ఈ నిబంధనలు పెట్టారు.

అయితే సిటీ శరవేగంగా అభివృద్ధి జరగడంతో 111ను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే 111 జీవోపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ ప్రకటించారు. ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగడం, విచ్చల విడిగా నిర్మాణాలు, బహుళ అంతస్తులు, బడా బాబుల ఫాం హౌజ్‌ల అడ్డాలుగా మారింది. ఇది పర్యావరనానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఎన్జీవో సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. 111 జీవో పై వేసిన ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ రిపోర్ట్‌ను చూసి ఎత్తివేస్తామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. భ‌విష్యత్తులో హైదరాబాద్‌ తాగునీటికి సమస్య రాదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జలాలు నీళ్లు అవసరం లేదని గోదావరి, కృష్ణా జలాలే పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఒకే సారి కాకుండా దశల వారీగా ట్రిపుల్‌ వన్‌ జీవోను ఎత్తివేస్తామని చెప్పింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్లు, గ్రీన్ జోన్లు ఏర్పాటు చేస్తామ‌ని ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలోనే అన్నింటిని పరిశీలించిన క్యాబినెట్‌ మొత్తం111 జీవోనే ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. HMDA పరిధిలో ఎలాంటి నియమ నిబంధనలు వర్తిస్తాయో.. అవన్నీ ట్రిపుల్‌ వన్ జీవోలో వర్తిస్తాయని ప్రకటించింది. దీంతో దాదాపు ల‌క్షా 32 వేల 6 వంద‌ల ఎక‌రాలు అందుబాటులోకి వ‌స్తుంది. అంటే, భూమి స‌ర‌ఫ‌రా పెరుగుతుంది. కాబ‌ట్టి, ఆటోమెటిగ్గా స్థలాల ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. ఇప్పుడున్న గిరాకీ కూడా ఉండదు. స్థలాల ధ‌ర‌లు అధికంగా ఉండ‌టం, అప‌రిమిత సంఖ్యలో అంత‌స్తులు వేసుకునే వెసులుబాటు ఉండ‌టం వ‌ల్ల.. ఎక్కువ శాతం డెవ‌ల‌ప‌ర్లు యూడీఎస్‌, ప్రీలాంచ్‌ స్కీములంటూ మొదలు పెడుతారు. ఇప్పుడు ఎక్కువ భూమి అందుబాటులోకి రావ‌డం వ‌ల్ల యూడీఎస్‌, ప్రీలాంచ్ ప్రాజెక్టుల‌కు చెక్ ప‌డనుంది. ప్రధానంగా కోకాపేట్‌, కొల్లూరు, వెలిమ‌ల‌, పాటి ఘ‌న‌పూర్ వంటి ప్రాంతాల్లో యూడీఎస్‌, ప్రీలాంచ్‌ ప్రాజెక్టుల్ని ఆరంభించిన వారికి ఇది పెద్ద షాక్‌ ఇస్తుంది. ఎందుకంటే, ప‌క్కనే ఎక్కువ భూమి అందుబాటులోకి రావడంతో సరఫరా పెరిగి.. గిరాకీ తగ్గుతుంది. ప్లాట్ల రేట్లు త‌గ్గితే అక్కడే కొనుక్కోవ‌డానికి ప్రయ‌త్నిస్తారు త‌ప్ప.. అక్రమ రీతిలో అమ్మే ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనేందుకు చాలామంది ముందుకు రారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..