Hyderabad: హైదరాబాద్‌లో ఔట్‌సైడ్ ఫుడ్ తింటున్నారా.? చూసి అధికారులకే మైండ్ బ్లాంక్
సిటీలో ఔట్ సైడ్ ఫుడ్ తింటున్నారా..? అయితే మీరు త్వరగా ఔటైపోతారు. కల్తీ.. కల్తీ.. కల్తీ.. యాడ చూసినా కల్తీనే. మీరు తినేది.. తాగేది ఏదీ ఒరిజినల్ కాదు. హైదరాబాద్ నగరాన్ని.. కల్తీ ఆహార పదార్థాలు కలవరపెడుతున్నాయి. అక్రమంగా కాసులు సంపాదించేందకు ప్రజారోగ్యంతో చెలగాడం ఆడుతున్నారు అక్రమార్కులు.

సిటీలో ఔట్ సైడ్ ఫుడ్ తింటున్నారా..? అయితే మీరు త్వరగా ఔటైపోతారు. కల్తీ.. కల్తీ.. కల్తీ.. యాడ చూసినా కల్తీనే. మీరు తినేది.. తాగేది ఏదీ ఒరిజినల్ కాదు. హైదరాబాద్ నగరాన్ని.. కల్తీ ఆహార పదార్థాలు కలవరపెడుతున్నాయి. అక్రమంగా కాసులు సంపాదించేందకు ప్రజారోగ్యంతో చెలగాడం ఆడుతున్నారు అక్రమార్కులు. జూలై 2న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు వెలుగుచూశాయి. ఎల్బీనగర్, మహేశ్వరం, మల్కాజ్‌గిరి, భువనగిరి ప్రాంతాల్లో భారీగా కల్తీ సరుకులు అధికారులు సీజ్ చేశారు.
తనిఖీల్లో 575 లీటర్ల కల్తీ నెయ్యి, 3,946 కిలోల అల్లం పేస్ట్, 3,037 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, 250 కిలోల కల్తీ పన్నీర్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలను నకిలీ బ్రాండ్లు ఉపయోగించి కిరాణా షాపులకు సరఫరా చేస్తున్న ముఠాను గుర్తించారు. ఎక్కువ లాభాలు వస్తూ ఉండటంతో.. కొన్ని దుకాణాలు దీన్ని అది కల్తీ మాల్ అని తెలిసినా అమ్ముతున్నట్టు వెల్లడైంది.
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లను సింథటిక్ ఫుడ్ కలర్స్‌తో తయారు చేస్తూ 100 గ్రాముల డబ్బా నుంచి కిలో ప్యాకుల వరకూ మార్కెట్‌లోకి సరఫరా చేశారు. ఇదే కాదు మిగిలిన వంట మసాలాలు, పాలు, కారం, టీ పొడి, స్వీట్లు, పసుపు, స్వీట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ వస్తువులు, మినరల్ వాటర్ సైతం కల్తీకి అవుతున్నాయి. హోటళ్లలో నిల్వ ఉంచిన చెడు ఫుడ్ ఐటమ్స్ కూడా తనిఖీల్లో వెలుగుచూశాయి. FSSAI లైసెన్సు లేకుండా, ట్రేడ్ లైసెన్సుల్లేకుండా, అశుభ్రత, నకిలీ బ్రాండ్లతో విక్రయాలు, చైల్డ్ లేబర్ వినియోగం, ఎక్స్‌పైర్ అయిన ముడి పదార్థాలు, బ్యాన్ అయిన రంగులు, తేది లేకుండా ప్యాకింగ్ వంటివి గమనించి.. 46 కేసులు నమోదు చేసి.. 52 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఇంకొన్నిచోట్ల కేటుగాళ్లు ఇంకా స్మార్ట్‌గా బిహేవ్ చేస్తున్నారు. బయటికి ప్రముఖ బ్రాండ్‌ల ప్యాకింగ్ వేసి.. లోపల నాసిరకం పదార్థాలు పెట్టి తతంగం కానిస్తున్నారు. ప్రజలు ప్రాణాలను గుళ్ల చేస్తోన్న కల్తీ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. దీంతో వినియోగదారులే జాగ్రత్తగా ఉండాలి అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు ఎటువంటి ఆహార వస్తువైనా కొనుగోలు చేసే ముందు ఎక్స్‌ఫైరీ డేట్, ప్యాకింగ్ కండిషన్, బ్రాండ్ నేమ్ పక్కాగా చెక్ చేయాలని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి