Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

Dating Apps: ఏమంటూ స్మార్ట్‌ ఫోన్‌ చేతులోకి వచ్చిందో ప్రపంచం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతోన్న టెక్నాలజీ ఓవైపు మేలు చేస్తుందని సంతోషించేలోపే మరోవైపు నస్టాన్ని మిగిలిస్తోంది...

Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..
Dating Apps
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 17, 2021 | 7:05 AM

Dating Apps: ఏమంటూ స్మార్ట్‌ ఫోన్‌ చేతులోకి వచ్చిందో ప్రపంచం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతోన్న టెక్నాలజీ ఓవైపు మేలు చేస్తుందని సంతోషించేలోపే మరోవైపు నస్టాన్ని మిగిలిస్తోంది. ఇక స్మార్ట్‌ ఫోన్‌, ఇంటర్‌నెట్‌ విప్లవంతో ఆన్‌లైన్‌ డేటింగ్ కల్చర్‌ కూడా విపరీతంగా పెరిగిపోతోంది. ఇందుకోసం ఏకంగా ప్రత్యేక యాప్‌లు పుట్టుకొస్తుండడంతో డేటింగ్ సంస్కృతి విస్తరిస్తోంది. ఒకప్పుడు డేటింగ్‌ అనే పదం వింటేనే ఏదో ఆందోళన. ఏదో పలకకూడని మాట. గాడితప్పిన కల్చర్‌కు కేరాఫ్‌ అడ్రస్. కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో డేటింగ్ ఒక కల్చర్‌లా మారింది. ఇక హైదరాబాద్‌ నగరం ఈ డేటింగ్‌లో మొదటి స్థానంలో నిలవడం కలవరపెడుతోంది. తాజాగా నిర్వహించి ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయం వెల్లడైంది.

ప్రముఖ డేటింగ్ యాప్‌ టిండర్స్‌ ఇయర్‌ ఇన్‌ స్వైప్‌ 2021 పేరుతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో తేలిన వివరాల ప్రకారం డేటింగ్‌లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మొత్తం డేటింగ్ సర్వేలో హైదరాబాద్‌ నగరం మొదటి స్థానంలో నిలిస్తే, తర్వాత స్థానాల్లో చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె నగరాలు ఉన్నాయి. 2021 జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు టిండర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ప్రధానంగా 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో ప్రధానంగా పిక్‌నిక్‌ ఇన్‌ ఎ పార్క్‌, వర్చువల్‌ మూవీ నైట్‌, సైక్లింగ్‌, పొట్టెరీ అంశాలపై ఎక్కువ మంది ఆసక్తి కనబరిచారు. ఎక్కువ మంది తమ డేటింగ్ అంశాలన్నీ వీడియోకాల్‌ లోనే చేశారు. అందుకే .. వీడియోకాల్‌ వృద్ధిలో 52 శాతం సాధించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇక డేటింగ్ ఈ స్థాయిలో పెరగడానికి కరోనా కారణంగా చెబుతున్నారు. రెండేళ్లలో చాలా మంది ఒకరినొకరు కలవలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో కూడా వీడియో డేటింగ్‌లలో కూడా చాలా మంది పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే పలు రకాల మోసపూరిత డేటింగ్‌ సంస్థలు ప్రజల అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని మోసాలకు కూడా పాల్పడుతున్నాయి. డేటింగ్‌ యాప్‌ల ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న మోసాల్లో 33 శాతం క్యాట్‌ ఫిషింగ్‌, 38 శాతం హానికరమైన లింక్‌లు లేదా అటాచ్‌మెంట్లు, 36 శాతం మంది ఫోన్లలో డేటా చోరీ జరిగినట్లు కాస్పర్‌స్కీ గ్లోబర్‌ సర్వేలో వెల్లడైంది. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, నోయిడా తదితర నగరాల్లో సర్వే నిర్వహించగా.. వారం రోజుల వ్యవధిలోనే 300 శాతం సబ్‌స్క్రిప్షన్‌ పెరిగిందని ఫ్రెంచ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ కమ్యూనిటీ వేదిక తమ నివేదికలో తెలిపింది.

Also Read: Deepika Padukone: చక్కర్లు కొడుతున్న బాలీవుడ్ కపుల్.. తగ్గేదెలా అంటున్న రణవీర్, దీపిక

Bigg Boss 5 103 episode: టాస్క్‌లు, గొడవలతో రచ్చ రచ్చగా సాగిన ఎపిసోడ్‌.. సిరి, సన్నీల గొడవకు ఫుల్‌స్టాప్‌ పడేనా.?