AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Omicron: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు.. హైదరాబాద్‌లో అధికారుల హై అలర్ట్..

లేటేస్ట్‌గా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త ప్రాంతాలకూ విస్తరిస్తోంది ఒమిక్రాన్‌ వేరియంట్. హైదరాబాద్‌లో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు..

Covid Omicron: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు.. హైదరాబాద్‌లో అధికారుల హై అలర్ట్..
Omicron Variant
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 16, 2021 | 9:24 PM

మన దేశంలోకి ఎంట్రీ ఆలస్యంగా వచ్చినా.. లేటేస్ట్‌గా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ రాష్ట్రం.. ఆ రాష్ట్రం అని లేదు.. దేశమంతా కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్త ప్రాంతాలకూ విస్తరిస్తోంది ఒమిక్రాన్‌ వేరియంట్. హైదరాబాద్‌లో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూశాయి. ఈ నాలుగు కేసులతో కలిపి మొత్తం 7కి చేరింది తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ నాలుగు వివిధ దేశాల నుంచి వచ్చినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరంతా రిస్క్ దేశాల నుండి ఒకరు, నాన్‌ రిస్క్ దేశాల నుండి ముగ్గురు వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో రెండు ఒమిక్రాన్ వేరియంట్‌ కేసులు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అలర్టయింది. ఈ కేసులు వెలుగు చూసిన కాలనీలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారులు.

ద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు. బాధితులు కలిసిన, సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో పడ్డారు వైద్యాధికారులు. కరోనా ఏ వేరియంట్‌కైనా ఒకటే ఆయుధం. మాస్క్‌. సక్రమంగా పెట్టుకుంటే ఏ వైరస్‌ దరిచేరదని చెప్తున్నారు వైద్యులు.

మన దేశంలో ఇప్పటి వరకూ ఉన్న కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ వ్యాప్తి 70 రెట్లు అధికం అని నిర్థారించారు. అదే సమయంలో డెల్టాతో పోలిస్తే కొత్త వేరియంట్‌ ఊపిరి తిత్తులపై చూపించే ప్రభాగం 10 రెట్లు తక్కువని చెప్పుతున్నారు. ఇదొక్కటే ప్రస్తుతానికి ఊరట కలిగించే అంశం. కాగా మన దేశంలో ఫిబ్రవరి నాటికి ఒమిక్రాన్‌ కేసులు అత్యధిక స్థాయికి చేరతాయని అంఛనా వేస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

మరోవైపు దేశంలో కరోనా కేసులు గణనీయ స్థాయిలో తగ్గడం ఊరటనిస్తోంది. వ్యాక్సినేషన్‌ మరింత వేగంవంతం చేయడం ద్వారా ఒమిక్రాన్‌ను కొంత మేర అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు

ఇవి కూడా చదవండి: Robbery Gang: అక్షయ్ కుమార్ సినిమా చూసి ఇన్‌స్ఫైర్‌ అయ్యారు.. కోట్లు కొల్లగొట్టాలని ప్లాన్ చేసి బుక్కయ్యారు.. 

Uttar Pradesh Elections 2022: బాబాయ్‌-అబ్బాయ్‌ మధ్య కుదిరిన డీల్‌.. యూపీ రాజకీయాల్లో కీలక పరిణామం..