Hyderabad: బిర్యానీలో మటన్ ముక్కలు లేవని గొడవ.. కస్టమర్లపై దాడిచేసిన వెయిటర్స్.. రాజాసింగ్ ఫైర్
అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు కస్టమర్లపై దాడి చేశారు. అర్ధరాత్రి అబిడ్స్ GPO వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా వేయలేదని... బిల్ మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో కస్టమర్లకు వెయిటర్లు మధ్య మాటామాటా పెరిగింది.
అబిడ్స్ గ్రాండ్ హోటల్ వెయిటర్లు కస్టమర్లపై దాడి చేశారు. అర్ధరాత్రి అబిడ్స్ GPO వెనుక ఉన్న గ్రాండ్ హోటల్ వెయిటర్లు కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా వేయలేదని… బిల్ మాత్రం పూర్తిగా తీసుకుని కస్టమర్లను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో కస్టమర్లకు వెయిటర్లు మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఇరు వర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి.. నూతన సంవత్సరం సందర్భంగా దూల్‌పెట్ కు చెందిన కొందరు వ్యక్తులు రాత్రి మటన్ బిర్యానీ తీసుకురావాలని వెయిటర్ చెప్పారు. అయితే బిర్యానీలో మటన్ ముక్కలు సరిగా లేవని… తాము పూర్తి డబ్బులు చెల్లించలేమని హోటల్ వెయిటర్లతో వినియోగదారులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్రమైంది. మొదటగా హోటల్ వెయిటర్లపై దాడికి దిగడంతో… వెయిటర్లు వినియోగదారులపై కర్రలతో దాడి చేశారు. కొంతమంది వినియోగదారులకు తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. హోటల్ యజమానిపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన ముగ్గురు వెయిటర్లను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రెస్టారెంట్‌లో సిబ్బంది కస్టమర్లపై దాడి చేసిన ఘటనపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెయిటర్లు, రెస్టారెంట్ యజమానులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై పోలీసులు రెస్టారెంట్ పై 324, 504, 509 కింద కేసు నమోదు చేశారు. అయితే రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..