AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇన్ స్టాలో వీడియో పెట్టడానికి పోలీస్ స్టేషన్‌ ముందే గంజాయి తాగాడు.. కట్ చేస్తే..

దీన్నే అహంకారం అంటారు.. ఇంకొన్ని చోట్ల పిచ్చి, వెర్రితనం, ఓవరాక్షన్ అంటారు. గంజాయి అనేది ఇల్లీగల్ అన్న విషయం తెలిసిందే. దాని జాడ కనిపించినా పోలీసులు బెండు తీస్తారు. సెల్లో వేసి.. కఠిన సెక్షన్స్ కింద కేసు పెడతారు. అయితే ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌ ముందే గంజాయి తాగాడు. ఆ తర్వాత..

Hyderabad: ఇన్ స్టాలో వీడియో పెట్టడానికి పోలీస్ స్టేషన్‌ ముందే గంజాయి తాగాడు.. కట్ చేస్తే..
Weed Smoking
Ram Naramaneni
|

Updated on: Jan 01, 2024 | 4:17 PM

Share

గంజాయి.. ఇప్పుడు యువతను నిర్వీర్యం చేస్తున్న మత్తు మందు. పెద్ద ఎత్తున యువత గంజాయికి బానిస అయినట్లు నివేదికలు చెబుతున్నాయి. గంజాయి పెంపకం, అక్రమ రవాణా, వినియోగాన్ని అడ్డుకునేందుకు.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జైల్లో వేసి.. పరివర్తన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. ఎన్ని కేసులు పెడుతున్నా అస్సలు భయం కలగడం లేదు. తాజాగా ఓ యువకుడు పోలీస్ స్టేషన్ ముందే గంజాయి తాగాడు. ఆ తతంగాన్ని వీడియో తీసి ఇన్ స్టాలో పెట్టాడు. ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు.

రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా రోడ్డుపై గంజాయి తాగుతూ వీడియో చిత్రీకరించిన 25 ఏళ్ల వంశీ కృష్ణను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం బ్యాక్‌గ్రౌండ్‌లో ర్యాప్ సాంగ్‌తో ఈ వీడియోను రికార్డ్ చేశాడు. పెద్ద గొప్పలు పోతూ ఆ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశాడు. అది కాస్తా తక్షణమే వైరల్ అయ్యింది. కొందరు నెటిజన్లు.. వంశీపై నిప్పులు చెరిగారు. అతడిపై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ.. సీఎం రేవంత్ రెడ్డిని, హైదరాబాద్ సిటీ పోలీసులను ట్యాగ్ చేశారు.

దీంతో రంగంలోకి దిగిన రాంగోపాల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి వంశీ కృష్ణను శుక్రవారం అరెస్టు చేశారు. అతడిని కోర్టు ముందు హాజరుపరచగా, ఎనిమిది రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. దీంతో వంశీని చంచల్‌గూడలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు. పోలీసులు వంశీ పీఎస్‌ ముందు గంజాయి తాగుతున్న వీడియోకు , అతడిని జైలుకు తరలించిన దృశ్యాలను యాడ్ చేసి.. సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
విద్యార్ధులకు అలర్ట్.. టెన్త్ పబ్లిక్ 2026 పరీక్షల తేదీలు మారాయ్‌
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
ఇషాన్ కిషన్ వర్సెస్ సంజు శాంసన్..టీమిండియా ఓపెనర్ ఎవరో తెలుసా ?
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
సినిమా చూసి మహేష్ ఆ స్టార్ హీరోకు ఫోన్ చేసి ఏం చెప్పారంటే..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే సమస్యలన్నింటికీ చెక్..
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
తొలి బంతికే బౌండరీ.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయని అఫ్రిది
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలు..
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
అందాల శ్రద్దాకు ఆఫర్లు కరువాయే.. నెట్టింట మాత్రం
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
గుడ్లు Vs పనీర్.. ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణుల సూచన ఏంటంటే..
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..!
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే
రోజురోజుకీ పెరుగుతున్న ఆంజనేయ స్వామి.. ప్రత్యేక ఆలయం ఎక్కడుందంటే