Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat: ’14 నిమిషాల అద్బుతం’.. ఇకపై వందేభారత్‌లో ఆ ప్రక్రియ కూడా జెట్ స్పీడే..

ప్రధానమంత్రి పిలుపునకు ప్రతిస్పందనగా స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా 'స్వచ్ఛతా హీ సేవ' కోసం రైల్వే మంత్రిత్వ శాఖ '14 నిమిషాల అద్భుతం' పథకాన్ని ప్రారంభించింది. వందేభారత్ రైలు కోచ్‌లను వేగంగా, సంపూర్ణంగా 14 నిమిషాలలో శుభ్రపరచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20834..

Vande Bharat: '14 నిమిషాల అద్బుతం'.. ఇకపై వందేభారత్‌లో ఆ ప్రక్రియ కూడా జెట్ స్పీడే..
Vande Bharat Express
Follow us
Noor Mohammed Shaik

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2023 | 9:34 PM

హైదరాబాద్, అక్టోబర్ 2: ప్రధానమంత్రి పిలుపునకు ప్రతిస్పందనగా స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ‘స్వచ్ఛతా హీ సేవ’ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ’14 నిమిషాల అద్భుతం’ పథకాన్ని ప్రారంభించింది. వందేభారత్ రైలు కోచ్‌లను వేగంగా, సంపూర్ణంగా 14 నిమిషాలలో శుభ్రపరచడమే ఈ పథకం లక్ష్యం. ఇందులో భాగంగా అక్టోబర్ 2వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20834 విశాఖపట్నం – సికింద్రాబాద్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ‘14 నిమిషాలలోనే రైలును పూర్తిగా శుభ్రపరిచడం అనే అద్భుత ఛాలెంజ్‌ను చేపట్టింది దక్షిణ మధ్య రైల్వే. విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ’14 నిమిషాల అద్భుతం’ ఛాలెంజ్‌ను స్వయంగా పర్యవేక్షించామని అన్నారు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. మెకానికల్ అండ్ క్లీనింగ్ సిబ్బంది మొత్తం వందేభారత్ రేక్‌ను అంటే 16 కోచ్‌లను కేవలం 14 నిమిషాల వ్యవధిలో శుభ్రపరిచే పనిని విజయవంతంగా పూర్తి చేశారన్నారు.

రైలు ప్రయాణీకులకు ఉన్నతశ్రేణి శుభ్రత, సౌకర్యవంతమైన రైలు అనుభవాన్ని అందించడానికి భారతీయ రైల్వే 14 నిమిషాల అద్భుత పథకాన్ని ప్రారంభించిందని అరుణ్ కుమార్ జైన్ ప్రసంగించారు. ప్రయాణీకులకు పరిశుభ్రతపై జాతీయ స్థాయి పిలుపు, ప్రపంచస్థాయి సేవలను అందించాలనే మా నిబద్ధతకు ఈ సవాల్ ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. 14 నిమిషాల క్లీనింగ్ ఛాలెంజ్ వల్ల స్టేషన్‌లో వేచి ఉండే సమయాన్ని తగ్గిస్తుందని, ప్రయాణికులకు రైలు ఎక్కేందుకు ఎక్కువ సమయాన్ని ఉంటుందని తెలిపారు. ’14 నిమిషాల అద్భుతం’ ఛాలెంజ్ ఒక్కసారి చేసే ప్రక్రియ కాదని, ఇది నిరంతరం ఈ రోజు నుంచి అన్ని వందేభారత్ రైళ్లలో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని జనరల్ మేనేజర్ చెప్పారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని వందేభారత్ రైళ్లలో 100 శాతం కంటే ఎక్కువ సీట్ల సామర్ధ్యాన్ని నమోదు కావడం పట్ల జనరల్ మేనేజర్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. రైలు వినియోగదారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని మానుకోవాలని, స్వచ్ఛత, క్లీన్ అండ్ గ్రీన్ ఇండియాకు కట్టుబడి భారతదేశాన్ని పరిశుభ్ర దేశంగా మార్చడానికి సమిష్టిగా కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో 16 కోచ్‌లు ఉంటాయి. ప్రతి కోచ్‌ను ఖచ్చితంగా శుభ్రం చేయడానికి 16 శుభ్రతా బృందాలను కేటాయించారు. ప్రతి బృందంలో ముగ్గురు సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం అతి సూక్ష్మముగా నిర్దిష్ట పనిని నిర్వహిస్తుంది. ఈ సిబ్బందికి ‘స్వచ్ఛ్ వందే వీర్స్’ అని పేరు పెట్టారు. 14 నిమిషాల నిర్దిష్ట సమయపాలనకు అద్భుతమైన సమన్వయం, ఖచ్చితత్వం, సామర్థ్యం అవసరం. రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చి ప్రయాణికులు దిగిన వెనువెంటనే 14 నిమిషాల నిర్దిష్ట సమయ గడియారం టిక్.. టిక్..తో ప్రారంభమవుతుంది. శుభ్రపరిచే సిబ్బంది పూర్తి సమన్వయముతో యంత్రంలా కలిసి పని చేసే చర్యలోకి దిగుతారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..