మంత్రి కేటీఆర్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే.. ఎందుకంటే.?
నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను దివ్యాంగుడంటూ హేళన చేశారంటూ తీవ్ర ఆవేదనతో కంచర్ల భూపాల్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక ఆ తర్వాత జరిగిన సభలో..
నల్గొండ, అక్టోబర్ 2: నల్లగొండలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను దివ్యాంగుడంటూ హేళన చేశారంటూ తీవ్ర ఆవేదనతో కంచర్ల భూపాల్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ హబ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఎన్జీ కాలేజీలో నియోజకవర్గ ప్రగతి నివేదన సభ జరిగింది.
నల్లగొండ నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. తనను దివ్యాంగుడంటూ కొందరు హేళన చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్ సమక్షంలో భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, భాస్కర్ రావులు భూపాల్ రెడ్డి ఓదార్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రూ. 1350 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధితో తన ఇరవై ఏళ్ల కల సాకారమైందని కంచర్ల వివరణ ఇచ్చారు. నల్లగొండ అభివృద్ధిపై చర్చకు రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భూపాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దివ్యాంగుడంటూ హేళన చేసిన నేతలకు నల్లగొండ జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని మంత్రి కేటీఆర్ అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..