AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 12 ఏళ్ల బాలుడికి యశోద ఆస్పత్రిలో పునర్జన్మ!

అవయవ మార్పిడిలో యశోద ఆసుపత్రి కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ తాగిన 12 ఏళ్ల అనురాగ్ సందీప్ కు ఊపిరితిత్తుల మార్పులు చేసి అతని ప్రాణాలను కాపాడింది యశోద హాస్పిటల్. ప్రపంచంలో ఎన్నో ఊపిరితిత్తుల మార్పిడి జరుగుతున్నప్పటికీ 12 సంవత్సరాల చిన్న పిల్లాడికి..

Hyderabad: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. 12 ఏళ్ల బాలుడికి యశోద ఆస్పత్రిలో పునర్జన్మ!
World First Bilateral Lobar Lung Transplant At Yashoda Hospital
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 12:21 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 19: అవయవ మార్పిడిలో యశోద ఆసుపత్రి కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసింది. ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ తాగిన 12 ఏళ్ల అనురాగ్ సందీప్ కు ఊపిరితిత్తుల మార్పులు చేసి అతని ప్రాణాలను కాపాడింది యశోద హాస్పిటల్. ప్రపంచంలో ఎన్నో ఊపిరితిత్తుల మార్పిడి జరుగుతున్నప్పటికీ 12 సంవత్సరాల చిన్న పిల్లాడికి ఇలాంటి అరుదైన చికిత్స చేయడం ఇదే మొదటి సారని చెప్పడం గర్వంగా ఉందంటున్నారు వైద్యులు. గతంలో పారాక్వాట్ పాయిజన్ తాగిన వారికి మరణం తప్ప వేరే దారి ఉండేది కాదని, కానీ ఇప్పుడు అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయనీ తెలిపారు. వెంటిలేటర్ లో లేటెస్ట్ అప్డేట్ ఎక్ మో లాంటి అధునాతన సదుపాయాలు అందుబాటులో వచ్చాయనీ.. సకాలంలో హాస్పిటల్ కు వస్తే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడేయచ్చని డాక్టర్‌ విశ్వేశ్వరన్ అన్నారు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన 12 ఏళ్ల అనురాగ్ కి రెండు ఊపిరితిత్తులను మార్చడం ద్వారా ఆ పిల్లాడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అనురాగ్ ప్రమాదవశాత్తు పారాక్వాట్ పాయిజన్ సేవించడం వల్ల ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. రెండువైపులా లోబర్ ఊపిరీతిత్తుల మార్పిడి అనేది ఒక అవయవ మార్పిడనీ.. పారాక్వాట్ పాయిజన్ ద్వారా ఈ అబ్బాయి ఊపిరితిత్తులు తోపాటు కాలేయం మూత్రపిండాలు కూడా క్రమంగా దెబ్బతిన్నాయని చికిత్స తర్వాత మూత్రపిండాలు కాలేయం యధా స్థానానికి వచ్చినప్పటికీ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అలాగే ఉండిపోయి పూర్తిగా పాడైపోయాయని వైద్యులు తెలిపారు.

అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అవడంతో పరిస్థితి విషమంగా మారింది. దీంతో బాలుడిని వెంటిలేటర్ సహాయంతో పాటు ఏక్ మో ద్వారా రెండు వారాల పాటు బయట నుంచి ఆక్సిజన్ అందించినప్పటికీ ఊపిరితిత్తుల పరిధిలో ఎటువంటి డెవలప్మెంట్ కనిపించలేదు. దీంతో లంగ్స్ మార్పిడి తప్పదని వైద్యులు నిర్ధారించామని తెలిపారు. అయితే ఈ 12 ఏళ్ల బాలుడికి సరిపోయే ఊపిరితిత్తులు లభించకపోవడంతో ఇతని కంటే పెద్దవాడైన దాత దగ్గరి నుంచి ఊపిరితిత్తులను తీసుకొని, ఈ 12 ఏళ్ల బాలుడు చాతికి సరిపోయేలా లంగ్స్ లోని లోపలి బాగాన్ని తొలగించి ఆపరేషన్ చేశామని, ఇది అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ గా వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆపరేషన్ జరిగి దాదాపు 6 నెలలు గడుస్తుందని, ప్రస్తుతం అనురాగ్ కోరుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. అయితే అనురాగ్ రెగ్యులర్‌గా వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుందని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చికిత్సలో భాగంగా బాలుడి లంగ్స్ పనితీరును పరిశీలిస్తున్నట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు వివరించారు. కాగా ఆపరేషన్‌ జరిగిన తర్వాత బాలుడు అనురాగ్‌ బీచ్ లో పరిగెడుతున్న వీడియోలు దృశ్యాలు వైరల్‌గా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం