AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పాతబస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. ఒకరి అరెస్ట్..

హైదరాబాద్ పాతబస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్థరాత్రి తర్వాత హఠాత్తుగా రౌడీషీటర్ల ఇండ్లపై తనిఖీలు నిర్వహించారు పోలీసులు. రౌడీషీటర్లు ఇండ్లలో..

Hyderabad: పాతబస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. ఒకరి అరెస్ట్..
Hyderabad Cops
Shiva Prajapati
|

Updated on: Nov 26, 2022 | 1:14 PM

Share

హైదరాబాద్ పాతబస్తీలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. అర్థరాత్రి తర్వాత హఠాత్తుగా రౌడీషీటర్ల ఇండ్లపై తనిఖీలు నిర్వహించారు పోలీసులు. రౌడీషీటర్లు ఇండ్లలో ఉన్నారా లేకపోతే ఏమైనా ఇతర కార్యక్రమాలలో ఉండి నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారా? అన్న కోణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. నేర సామ్రాజ్యాం నుంచి దూరంగా ఉండి, పద్ధతులు మార్చుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని, అనవసరమైన కార్యక్రమాల్లో వెళ్లి ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తే చట్టం తన పని చేసుకుపోతుందని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర రౌడీషీటర్లకి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు.

స్నూకర్ పార్లర్‌పై దాడులు..

హైదరాబాద్ పాతబస్తీ హుస్సేని అలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కీలవాత్ ఏరియాలో సమయానికి మించి నడుపుతూ స్థానికులని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న స్నూకర్ పార్లర్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్నూకర్ పార్లర్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో పాతబస్తీ యువకులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా పెద్ద ఎత్తున స్నూకర్ పార్లర్‌లో హంగామా సృష్టిస్తున్నారని ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

వ్యక్తి అరెస్ట్..

పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్న హైదారాబాద్ పాతబస్తీకి చెందిన అబ్దుల్ రహీమ్ అనే వ్యక్తిని భవాని నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రహీమ్.. ప్రజాప్రతినిధులను అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు.. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. నిందితుడు రహీమ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. అరెస్ట్ చేశారు. అయితే, రహీమ్‌ను అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులకు చుక్కలు చూపించాడు రహీమ్. తనంతట తానే గాయపరుచుకుని పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడు. దాంతో పోలీసులు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స అందించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.

ఇవి కూడా చదవండి

– నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..