Hyderabad: డార్క్ వెబ్‌సైట్ మాటున డర్టీ పనులు.. మరి పోలీసులు ఊరుకుంటారా.. ఏం జరిగిందో మీరే చూసేయండి..

Hyderabad: నాలెడ్జ్‌లో సౌండ్‌.. ఫైనాన్షియల్‌గా సౌండ్‌.. బాగా చదువుకున్న వారు ఇప్పుడు డగ్స్‌ దందాలో దిగారు. డార్క్‌నెట్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు.

Hyderabad: డార్క్ వెబ్‌సైట్ మాటున డర్టీ పనులు.. మరి పోలీసులు ఊరుకుంటారా.. ఏం జరిగిందో మీరే చూసేయండి..
Drugs
Follow us
Shiva Prajapati

|

Updated on: Sep 01, 2022 | 8:46 PM

Hyderabad: నాలెడ్జ్‌లో సౌండ్‌.. ఫైనాన్షియల్‌గా సౌండ్‌.. బాగా చదువుకున్న వారు ఇప్పుడు డగ్స్‌ దందాలో దిగారు. డార్క్‌నెట్‌ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారు. అంతా హైటెక్‌ తీరులో జరుగుతున్న ఈ దందాను బ్లాస్ట్ చేశారు హైదరాబాద్‌ పోలీసులు. 8 మందిని అరెస్ట్‌ చేశారు. తొమ్మిది లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్‌ కన్స్యూమర్ల కు సంబంధించిన కీలక డేటా కూడా దొరకబుచ్చుకున్నారు.

డార్క్‌నెట్‌లో ప్రత్యేక ఐడీల ద్వారా డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అందమైన కొరియర్‌లో సరఫరా చేస్తున్నట్లు కనుగొన్నారు. ట్రానాక్షన్స్‌ మొత్తం క్రిప్టో కరెన్సీలో జరుగుతున్నాయి. డ్రగ్స్‌ ముఠాలో ప్రధాన సూత్రధారి నరేంద్ర ఆర్యాను అరెస్టు చేశారు పోలీసులు. ఈయన దగ్గర 450 మంది కస్టమర్లు ఉంటే.. వారిలో హైదరాబాద్‌కు చెందిన వారు కూడా ఉన్నారని చెప్పారు.

నరేంద్ర ఆర్యా తన ఇంటి కాంపౌడ్‌ వాల్‌ కూడా దాటడానికి వీల్లేకుండా అక్కడ కుక్కలతో సెక్యూరిటీ పెట్టుకున్నాడు. పోలీసులు పట్టుకోవడానికి వెళ్లినప్పుడు వాళ్లపైకి 100 కుక్కల్ని వదిలారంటే ఎంత పక్కాగా ఎటాక్ ప్లాన్‌, ఎస్కేప్‌ ప్లాన్‌ రెడీ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రధాన నిందితుడు నరేందర్ నారాయణ్ దాస్ చాలా కన్నింగ్‌గా ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు. అతని భార్య విదేశీ మహిళని తెలుస్తోంది. ఇటు డ్రగ్స్‌ కస్టమర్లలో ఎక్కువ మంది స్టూడెంట్స్‌ ఉండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు సీపీ ఆనంద్‌. పిల్లల కదలికలు, వారికి వచ్చే పార్సిల్స్‌ పై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..