దోపిడిలు, దొంగతనాలు, హత్యలు.. హైవేపై కరడుగట్టిన పార్ధీ గ్యాంగ్.. సినిమా స్టైల్లో ఛేజింగ్.. చివరకు..

కరడుగట్టిన పార్థీ గ్యాంగ్.. వీళ్ల పని దొంగతనాలు, దోపిడిలు, హత్యలు.. టార్గెట్ చేశారంటే ఇక దోపిడి జరగాల్సిందే.. ఈ కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్ హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతుండటం కలకలం రేపింది.. ఈ క్రమంలోనే నల్లగొండ పోలీసులు ఆ గ్యాంగ్ పై కన్నేసి.. ఇద్దరిని అరస్ట్ చేసింది.. సినిమా ఫక్కిలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ లో..

దోపిడిలు, దొంగతనాలు, హత్యలు.. హైవేపై కరడుగట్టిన పార్ధీ గ్యాంగ్.. సినిమా స్టైల్లో ఛేజింగ్.. చివరకు..
Crime News
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 06, 2024 | 1:23 PM

కరడుగట్టిన పార్థీ గ్యాంగ్.. వీళ్ల పని దొంగతనాలు, దోపిడిలు, హత్యలు.. టార్గెట్ చేశారంటే ఇక దోపిడి జరగాల్సిందే.. ఈ కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్ హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై దోపిడీ, దొంగతనాలకు పాల్పడుతుండటం కలకలం రేపింది.. ఈ క్రమంలోనే నల్లగొండ పోలీసులు ఆ గ్యాంగ్ పై కన్నేసి.. ఇద్దరిని అరస్ట్ చేసింది.. సినిమా ఫక్కిలో దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ లో ఇద్దరూ కీలక సభ్యులను నల్లగొండ పోలీసులు తాజాగా.. అరెస్టు చేశారు. కరుడుగట్టిన నేరస్థులుగా ఉన్న వీరు 32 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. రెండు మూడు నెలలుగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని టార్గెట్ గా చేసుకుని పార్థీ గ్యాంగ్ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతోందని పోలీసులు తెలిపారు. హైవే వెంట పార్క్ చేసిన వాహనాల్లోంచి డీజిల్ దొంగతనాలు మొదలు.. రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి దారి దోపిడీలకు దుండగులు పాల్పడుతున్నారు.

ఈ గ్యాంగ్ దోపిడి దొంగతనాలే కాదు.. హత్యలకు కూడా వెనకాడదు.. గత కొంత కాలం నుంచి కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పార్ధీగ్యాంగ్ ను అరెస్ట్ చేసేందుకు నల్లగొండ జిల్లా ఎస్పీ మూడు టీం లను రంగంలోకి దించారు.. ఈ క్రమంలోనే.. శుక్రవారం చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం, కొయ్యలగూడెంలలో దొంగతనాలకు పాల్పడిన పార్దీ గ్యాంగ్ అక్కడి నుంచి టాటాఎస్ వాహనంలో హైదరాబాద్ కు పారిపోతున్నారు. అప్పటికే గ్యాంగ్ పై నిఘా పెట్టిన నల్లగొండ స్పెషల్ పార్టీ పోలీసులు నార్కెట్‌పల్లి నుంచి వెంబడించారు.

ఓఆర్ఆర్ అంబర్పేట్ వద్ద పోలీసులు పార్ధీ గ్యాంగ్ ను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పార్థి గ్యాంగ్ సభ్యులు కత్తులతో పోలీసులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరిపి గ్యాంగ్ లో కీలకమైన ఇద్దరిని టాటా వాహనంలో పట్టుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ చెప్పారు.

ఈ ఇద్దరూ మహారాష్ట్రకు చెందిన అప్ప పాండ్రంగా, శుభం అశోక్ లుగా గుర్తించారు. వీరు క్రూరమైన కరుడుగట్టిన నేరస్తులని తెలిపారు. ఈ ముఠా నల్గొండ, సంగారెడ్డి జిల్లాతో పాటు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు దోపిడి దొంగతనాలకు పాల్పడిందని ఎస్పీ తెలిపారు.

హత్యలతోపాటు 32 నేరాల్లో ఈ గ్యాంగ్ నిందితులుగా ఉన్నారని జిల్లా ఎస్పీ చెబుతున్నారు. హైవే లను టార్గెట్ గా చేసుకొని పార్క్ చేసిన వాహనాల్లో నిద్రిస్తున్న వారిపై దాడి చేసి నగదు బంగారు ఆభరణాలను దోపిడీ చేస్తారని ఆయన తెలిపారు. ప్రతిఘటిస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకారని, ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని శరత్ చంద్ర పవర్ కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..