Warangal: నేటి నుండి భద్రకాళి అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు..

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు దైవం..భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి మహోత్సవాలకు వేళయింది.. నేడు ఆషాడ శుద్ధ పాడ్యమి నుండి మొదలై 21వ తేదీ పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి.. ఈ సారి 16 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు

Warangal: నేటి నుండి భద్రకాళి అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు..
Bhadrakali
Follow us
G Peddeesh Kumar

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 06, 2024 | 1:04 PM

శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.. నేటి నుండి 21వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.. ఈ రోజు సహస్ర కలిశాభిషేకాలు, గణపతి పూజ, పూర్వంగవిధి కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి ఏటా 15 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు అధిక మాసం వల్ల ఈసారి 16 రోజుల పాటు నిర్వహించనున్నారు.. 21వ తేదీ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకాంబరీగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు.. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని సృష్టిలో లభించే రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పలాలతో అలంకరించి ఆరాధిస్తారు.. ఈ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే కరువు దరి చేరదని కచ్చితంగా కోరికలు నెరవేరుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వసం..

ఆషాఢ మాసంలో మొట్టమొదటి శాకాంభరీ ఉత్సవాలు భద్రకాళి అమ్మవారి ఆలయంలోనే ఆరంభమవుతాయి.. ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు.. శాకంభరి ఉత్సవాల సందర్భంగా భద్రకాళి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాల కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.

ఉదయం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, అర్చకుల సమక్షంలో జ్యోతి ప్రజ్వలన అనంతరం అమ్మవారికి అభిషేకాలు నిర్వహిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?