Hyderabad: భాగ్యనగర వాసులకు ఇక ఢోకా లేనట్లే!.. అవసరమైన వారికి ఉచితంగా ఇచ్చేందుకు..
Hyderabad: వేసవి వచ్చిందంటే చాలు భాగ్యనగర వాసులు భయపడిపోతుంటారు. నీటి ఎద్దడిని తట్టుకోలేక అవస్థలు పడుతుంటారు.
Hyderabad: వేసవి వచ్చిందంటే చాలు భాగ్యనగర వాసులు భయపడిపోతుంటారు. నీటి ఎద్దడిని తట్టుకోలేక అవస్థలు పడుతుంటారు. నీటి కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా చూసేందుకు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. నీటి ఎద్దడి నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు తాగునీరు, సీవరేజి, తదితర అంశాలపై ఓ అండ్ ఎం అధికారులతో జలమండలి ఎండీ దాన కిశోర్ సమీక్ష నిర్వహించారు. రానున్న వేసవిలో నీటి కొరత ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రానున్న వేసవిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉందని అన్నారు.
ఇక వేసవి దృష్ట్యా ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు దాన కిశోర్. ఎక్కడైనా అవసరమైతే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే, కలుషిత నీరు సరఫరా కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోప్రెషర్, టెయిల్ ఎండ్ ప్రాంతాలను గుర్తించి అవసరమైన మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పవర్ బోర్‌వెల్స్ పనితీరును పరిశీలించి అవసరమైన చోట్ల మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని పేర్కొన్నారు.
సీవరేజి నిర్వహణలో సమస్యలు రాకుండా చూడాలని, ప్రజల నుంచి వివిధ మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సీవరేజి ఓవర్‌ఫ్లో నిరోధించడానికి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీవరేజి పనుల్లో కార్మికులు రక్షణ పరికరాలు తప్పనిసరిగా వినియోగించేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రిజర్వాయర్ల భద్రతకు సంబంధించి ఇప్పటికే అవసరమైన చోట్ల సెక్యూరిటీ సిబ్బందిని, అన్ని రిజర్వాయర్ల ప్రాంగణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు దానకిశోర్ పేర్కొన్నారు. కాగా, ఈ సమీక్షలో టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు, జీఎంలు, తదితర అధికారులు పాల్గొన్నారు.
Also read:
Zodiac Signs: వీరు ఇతరులకు తమ రహస్యాలు అస్సలు చెప్పరు.. వారిపై నమ్మకం వచ్చేవరకు మాట్లాడరు..