Viral Video: శివలింగాన్ని ప్రతిష్టించడంలో.. ముస్లిం వ్యక్తి కిరాక్ ఐడియా.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఉన్న ప్రసిద్ధ పశుపతి నాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని జలధారి అంటారు. జలధారి అంటే.. నీటితో ప్రతిష్టించిన అని అర్థం. ఇందుకోసం ఓ భారీ క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పనికోసం
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఉన్న ప్రసిద్ధ పశుపతి నాథ్ మహాదేవ్ ఆలయంలో సహస్త్రేశ్వర్ మహాదేవ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శివలింగాన్ని జలధారి అంటారు. జలధారి అంటే.. నీటితో ప్రతిష్టించిన అని అర్థం. ఇందుకోసం ఓ భారీ క్రేన్ సహాయం కూడా తీసుకున్నారు. ఈ పనికోసం పీడబ్ల్యూడీ, పీహెచ్ఇ జిల్లా పంచాయితీతో సహా అన్ని శాఖల ఇంజనీర్లు రంగంలోకి దిగారు. అయితే జిలహారిపై శివలింగాన్ని ఎలా ప్రతిష్టించాలనేది అందరి ముందు పెద్ద సవాలుగా మారింది. ఇందుకు ఇంజనీర్లు సైతం సరైన పరిష్కారం కనిపెట్టలేకపోయాడు. కానీ ఈ సమస్యకు ఓ ముస్లిం వ్యక్తి దేవుడిని ప్రతిష్టించే బాధ్యతను తీసుకున్నాడు. ఆ శివలింగం సహస్త్రేశ్వర్ రూపంలో చాలా ప్రత్యేకమైన ఆకృతిలో ఉంటుంది. అయితే దీని పొడవు 6.50 అడుగులు ఉంటుంది. బరువు రెండున్నర టన్నులు. ఈ శివలింగం ఏర్పాటు వెనక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ శివలింగం ప్రతిష్టించే సమయంలో ఇంజనీర్లకు పెద్ద సవాలు ఎదురైంది. ఈ సమస్యలతో పోరాడుతున్న ఇంజనీర్లకు అక్కడే కూలీగా పని చేస్తున్న మక్బూల్ శివలింగాన్ని ప్రతిష్టించేందుకు మార్గాన్ని చూపించాడు. దీంతో ఆ ఇంజనీర్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మక్బూల్ ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. అతనికి చదువు రాదు. కానీ తన పని అనుభవం ఆధారంగా ఆ సమస్యను పరిష్కరించాడు. జిలహారీలో శివలింగాన్ని ప్రతిష్టించే ప్రదేశంలో ఒక ఐస్‌ను ఉంచితే జిలహారీకి ఎలాంటి హాని ఉండదని.. శివలింగాన్ని కూడా సురక్షితంగా ప్రతిష్టించవచ్చని మక్బూల్ చెప్పాడు. మంచు కరగడంతో స్వామివారి శివలింగం జిలహారిలోకి ప్రవేశించి ప్రతిష్టించనుందని సూచించాడు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..
మహిళను చంపినంత పని చేసిన రోబో అరెస్ట్ !!
నిమ్మరసానికి 'గ్యాస్ ఛార్జ్'.. బిల్లు చూసి కస్టమర్ షాక్ !!
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!

