AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Former MLA: రెండేళ్ల తర్వాత కూతురు స్కూల్‌కి వెళ్తుంటే.. కొత్తకారులో బ్యాండ్ బాజాలతో సాగనంపిన తండ్రి ప్రేమ

Former MLA: ఏ తల్లిదండ్రులైనా సరే.. తాము బతికేది పిల్లల కోసం అంటారు.. అంతేకాదు తాము కష్టపడేది తమ సంతానానికి మంచి భవిష్యత్ ని ఇవ్వడానికి అని చెబుతారు. ఈ నేపథ్యంలో తమ..

Former MLA: రెండేళ్ల తర్వాత కూతురు స్కూల్‌కి వెళ్తుంటే.. కొత్తకారులో బ్యాండ్ బాజాలతో సాగనంపిన తండ్రి ప్రేమ
Vishnuvardhan Reddy Sends D
Follow us
Surya Kala

|

Updated on: Mar 23, 2022 | 10:02 AM

Former MLA: ఏ తల్లిదండ్రులైనా సరే.. తాము బతికేది పిల్లల కోసం అంటారు.. అంతేకాదు తాము కష్టపడేది తమ సంతానానికి మంచి భవిష్యత్ ని ఇవ్వడానికి అని చెబుతారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలలు బాగా చదువుకోవాలని.. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. వారిని రోజూ స్కూల్(School) కు పంపుతూ..వారికీ కావాల్సిన అన్ని సదుపాయాలను కలుగజేస్తారు. అయితే పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి మారాం చేస్తుంటే.. ఒకొక్కసారి నచ్చచెబుతారు.. లేదంటే మందలిస్తారు. అవసరం అయితే.. రెండు దెబ్బలు వేసి మరీ స్కూల్ కు పంపుతారు. ఎలాగైనా సరే.. తమ పిల్లలని పాఠశాల దగ్గర విడిచిపెట్టివస్తారు. అయితే కరోనా(Corona Virus) వచ్చిన తర్వాత పిల్లలు స్కూల్స్ వెళ్లే పనిలేకపోయింది. దాదాపు రెండేళ్లుగా విద్యార్థులకు స్కూల్స్ కు వెళ్లే అలవాటు తప్పింది. కరోనా అదుపులోకి వచ్చింది. మళ్ళీ స్కూల్స్, ఆఫీసులు అన్నీ యధావిధిగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలు బడిబాట పట్టాల్సి వచ్చింది. అయితే స్కూల్స్ కు వెళ్లే అలవాటు తప్పిన నేపథ్యంలో తమ పిల్లలని  తల్లిదండ్రులు పాఠశాలకు పంపిస్తున్నారు. అయితే ఓ మాజీ ఎమ్మెల్యే తన కూతుర్ని భిన్నంగా పంపించి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మాజీ ఎమ్మెల్యే  విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటి ముందు కొత్త కారు రెడీగా ఉంది.ఇంటి ముందు మేళం వాయించే వాళ్లు ఉన్నారు. ఇంట్లో బ్యాండ్ మ్రోగుతుంది. అయితే విష్ణువర్ధన్ రెడ్డి ఇంట్లో పెళ్లి ఫంక్షన్ ఏమీ జరగడం లేదు.. ఎందుకంటే ఆయనకు పెళ్ళికి ఎదిగిన కుమార్తె లేదు. కేవలం 8వ తరగతి చదువుతున్న కూతురు జనశ్రీ రెడ్డి ఉంది. ఆమె చిరేక్ ఇంటర్నేషన్‌ స్కూల్‌ లో చదువుతోంది. అయితే జన శ్రీ కరోనావెలుగులోకి వచ్చిన తర్వాత స్కూల్ కి వెళ్ళింది లేదు. ఇంట్లో ఉంటూనే 6వ తరగతి, 7వ తరగతి కంప్లీట్ చేసి.. ఇప్పుడు 8వ తరగతిలోకి అడుగు పెట్టింది. అయితే ఇప్పుడు కరోనా పూర్తిగా తగ్గడంతో మళ్ళీ స్కూల్స్ అన్నీ రీ ఓపెన్ అయ్యాయి. దీంతో జన శ్రీ స్కూల్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే రెండేళ్లుగా స్కూల్ కు వెళ్లే అలవాటు తప్పడంతో.. ఇబ్బంది పడడం మొదలు పెట్టింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి.. ఎక్కడ తన కూతురు స్కూల్ వెళ్ళను అంటుందో అని డిఫరెంట్ గా ఆలోచించారు. విష్ణువర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులు అలోచించి.. జన శ్రీని బ్యాండు మేళాల మధ్య కొత్త కారులో స్కూలుకు సాగనంపారు. తన కూతురు మళ్ళీ స్కూల్ యూనిఫామ్ లో కనిపించడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. కన్న తండ్రికి కూతురుపై ఉన్న ప్రేమకు ఫిదా కానివారుంటారా చెప్పండి.

Also Read:

Harish Shankar: బంపర్ ఆఫర్ అందుకున్న హరీష్ శంకర్.. మెగాస్టార్‌తో ఆ మూవీ రీమేక్