AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి .. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

తెల్లారే సరికి జీవితాలు తెల్లారిపోయాయి. బోయిగూడ అగ్ని ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. తెలతెలవారుతుండగానే సిటీని కన్నీళ్లు పెట్టించింది.

Telangana: బోయిగూడ అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి .. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
Cm Kcr
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2022 | 10:08 AM

Share

Bhoiguda fire accident: పొట్ట చేతబట్టుకొని సరిహద్దులు దాటి వచ్చిన వలస జీవితాలకు అప్పుడే నూరేళ్లు నిండాయి. సికింద్రాబాద్‌(Secunderabad) బోయిగూడ ఫైర్‌ యాక్సిడెంట్‌లో 11 మంది ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మంటలు అంతకంతకు పెరిగాయి. మంటల్లో చిక్కుకున్న కార్మికులు బయటకు రాలేకపోయారు. నిమిషాల వ్యవధిలోనే 11 మంది విగతజీవులయ్యారు.  ఈ మహా విషాాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్(CM Kcr) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కార్మికుల మృతదేహాలు స్వస్థలాలకు వెళ్లేలా చూడాలని సీఎస్‌ను.. ముఖ్యమంత్రి ఆదేశించారు.

కాగా  ప్రమాద సమాచారం తెలియగానే హుటహుటిన.. ఘటనా స్థలానికి చేరుకున్నాయి 8 ఫైరింజన్లు. నిమిషాల వ్యవధిలోనే మంటలను అదుపు చేశాయి. అయితే అప్పుటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 11 మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. మంటలను అదుపు చేయగల్గిన అగ్నిమాపక సిబ్బంది.. కార్మికుల ప్రాణాలను కాపాడలేకపోయింది. ప్రమాద సమయంలో గోడౌన్‌లో 12 మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా బీహార్‌ నుంచి వచ్చిన కూలీలు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు అరా తీస్తున్నారు. ఫైర్‌ సెఫ్టీ ప్రికాషన్స్ తీసుకోని కారణంగానే ప్రమాదం జరిగిందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో

1. సికందర్ (40)

2. బిట్టు (23)

3. సత్యేందర్ (35)

4. గొల్లు (28)

5. దామోదర్ (27)

6. చింటూ (27)

7. రాజేశ్ (25)

8. దీపక్ (26)

9. పంకజ్ (26)

10. ప్రేమ్ (25)

11. దినేశ్ (35)

ప్రాణాలు కోల్పోయారు. హుటాహుటిన స్పాట్‌ను సందర్శించారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపడతామని స్పష్టం చేశారు .

వీరంతా ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో నగరానికి చేరుకున్నారు. తమ బిడ్డల భవిష్యత్ బాగుండాలని ఆకాంక్షించారు. అయితే మంగళవారమే వారికి చివరి రోజైంది. రాత్రంతా పని చేసి.. తెల్లారాక తమ గూడుకు చేరుకొని.. నిద్రపోతామనుకున్నారు. కాని గోడౌన్‌లోనే శాశ్వతంగా నిద్రపోయారు కార్మికులు. ప్రాణాలు కోల్పోయిన వారంతా బీహార్‌ కూలీలే. 11 మంది కార్మికుల ప్రాణాలు తీసిన పాపం ఎవరిది..? యజమాని నిర్లక్ష్యం పది మందిని పొట్టన పెట్టుకుందా..? నిబంధనలను పాతరేశారా? అధికారుల వైఫల్యమెంత? యజమాని నిర్లక్ష్యమెంత..? పాపం ఎవరిదైనా.. 11 కార్మికుల జీవితాలు గాల్లో కలిశాయి.

Also Read: Telangana: అర్ధరాత్రి అక్క ముఖంపై సలాసలా కాగే వేడి నూనె పోసిన చెల్లి.. షాకింగ్ రీజన్