Hyderabad: పాతబస్తీ నాలాలో కనిపించిన సీన్.. ఉలిక్కిపడ్డ కాలనీవాసులు.. పరుగో పరుగు..!
హైదరాబాద్ మహానగరం పాతబస్తీ బహదూర్‌పురాలో జనావాసాల మధ్య ఓ మొసలి కనిపించి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న నాలాలో మొసలి కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
హైదరాబాద్ మహానగరం పాతబస్తీ బహదూర్‌పురాలో జనావాసాల మధ్య ఓ మొసలి కనిపించి కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న నాలాలో మొసలి కనిపించడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల మధ్యలోకే ఇలా మొసలి రావడం పట్ల భయభ్రాంతులకు గురై ప్రజలు పరుగులు పెట్టారు. చాలా మంది మొసలిని చూసేందుకు ఆసక్తి కనబరిచారు.
వెంటనే పోలీసులకు విషయం తెలపడంతో వారు అక్కడికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పక్కనే ఉన్న జవహర్ లాల్ నెహ్రూ జూ పార్కు సిబ్బంది మొసలి గురించి తెలుసుకున్నారు. దీంతో హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకుని మొసలిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అనంతరం జూ సిబ్బంది చాకచక్యంగా మొసలిని బంధించి జూ పార్క్‌కు తరలించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, మూసీ నదికి అనుకుని ఉన్న నాలాలో మొసలి ఉందన్న వార్త దావనంలా వ్యాపించడంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఇదే కాకుండా ఇటీవల తరచుగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ గల్లీల్లో మొసళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి క్రూర ప్రాణులు సంచరిస్తుంటే ఎలా ఇక్కడ ఉండేదని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సరైన రీతిలో చర్యలు చేపట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఏదైనా చూపాలని స్థానిక కాలనీవాసులు కోరుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..