Huzurabad MLA: హుజురాబాద్ ఎమ్మెల్యేకు వాస్తు భయం.. గెలిచిన తరువాత క్యాంప్ ఆఫీస్‌కు రాని కౌశిక్..!

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు పనులు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే నిర్మించిన ఈ భవనానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరమ్మత్తులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భవనానికి వాస్తు బాగా లేకపోవడం వల్లే అపశృతులు చోటు చేసుకుంటున్నాయని భావించి, వాటికి అనుకూలంగా మరమ్మత్తులు చేయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

Huzurabad MLA: హుజురాబాద్ ఎమ్మెల్యేకు వాస్తు భయం.. గెలిచిన తరువాత క్యాంప్ ఆఫీస్‌కు రాని కౌశిక్..!
Huzurabad Mla Kaushik Reddy
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2024 | 5:57 PM

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు పనులు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే నిర్మించిన ఈ భవనానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరమ్మత్తులు చేయించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భవనానికి వాస్తు బాగా లేకపోవడం వల్లే అపశృతులు చోటు చేసుకుంటున్నాయని భావించి, వాటికి అనుకూలంగా మరమ్మత్తులు చేయిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.

హుజూరాబాద్ నుండి అప్రతిహతంగా గెలుస్తున్న ఈటల రాజేందర్ ఈ క్యాంపు అందుబాటులోకి షిప్ట్ అయిన తరువాత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే వాదన స్థానికంగా వినిపిస్తోంది. కొత్తగా నిర్మించిన ఈ భవనంలోకి మారిన తరువాత మంత్రివర్గంలో స్థానం కోసం ఊగిసలాడడం, ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు రావడం, ఉప ఎన్నికలకు వెల్లడం, జనరల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వంటి చర్యలు కూడా క్యాంప్‌ కార్యాలయానికి వాస్తు లేకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

క్యాంపు ఆఫీసుకు సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉండటంతో పాటు భవనంలోని డోర్లు ఏర్పాటు చేయాల్సిన చోట చేయకపోవడం వల్ల ఇందులో నివసించే వారికి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురవుతాయన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలిచిన కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో కార్యకలాపాలు కొనసాగేందుకు వెనక ముందు ఆలోచించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనంలోనే మరమ్మత్తులు ప్రారంభం కానున్నాయి.

భవనాన్ని వాస్తుకు అనుగుణంగా సెట్ చేసిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం. అందుకే గెలిచి ఆరు నెలలు అవుతున్న ఇప్పటి వరకు క్యాంపు ఆఫీస్ లో అడుగు పెట్టలేదట. విశాలంగా క్యాంపు ఆఫీస్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి మాత్రం రావడం లేదట. వీణవంక తన స్వంత ఇంట్లోనే బస చేస్తున్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మరోవైపు మంచిగా ఉన్న క్యాంపు ఆఫీస్ కి మరమ్మతులు చేయించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి రాజకీయ పార్టీ నేతలకు వాస్తు భయం పట్టుకుంది. ఈ విషయం గురించి మాట్లాడానికి కౌశిక్ నిరాకరిస్తున్నారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త
టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త