పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు
హైదరాబాద్‌లో పబ్బుల గబ్బు కల్చర్ కంటిన్యూ అవుతోంది. గంజాయి, కొకైన్, మెత్ లాంటి మత్తు పదార్థాలు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. విచ్చలవిడి విష సంస్కృతికి బీజాలు వేస్తున్న పబ్బులపై ఎస్‌వోటీ, నార్కోటిక్ పోలీసులు రైడ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేసినా...హైదరాబాద్‌లో పబ్బుల తీరు మారడం లేదు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. వాళ్లకు పైసలే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లో పబ్బుల గబ్బు కల్చర్ కంటిన్యూ అవుతోంది. గంజాయి, కొకైన్, మెత్ లాంటి మత్తు పదార్థాలు వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. విచ్చలవిడి విష సంస్కృతికి బీజాలు వేస్తున్న పబ్బులపై ఎస్‌వోటీ, నార్కోటిక్ పోలీసులు రైడ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేసినా…హైదరాబాద్‌లో పబ్బుల తీరు మారడం లేదు. ఎన్ని అరాచకాలు జరుగుతున్నా.. వాళ్లకు పైసలే ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ది కేవ్ క్లబ్‌పై తాజాగా నార్కోటిక్ బ్యూరో , ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేయడంతో అస్సలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్బులో గంజాయి, కొకైన్, మెత్ విచ్చలవిడిగా వినియోగించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ది కేవ్ క్లబ్‌లో డ్రగ్స్ సేవించిన 55మందిని అదుపులోకి తీసుకుని టెస్టులు నిర్వహించారు. 26 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు పోలీసులు. అందులో డీజే గౌరవ్ కూడా కోకైన్ తీసుకున్నట్టు తేల్చారు పోలీసులు. వారిని విచారించగా డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వాహకులే డ్రగ్స్ విక్రయించినట్టు తేలింది. దీంతో దీనివెనకున్న అసలు సూత్రధారులు ఎవరన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

