గుప్తనిధుల కోసమే తవ్వకాలా ??  రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు

గుప్తనిధుల కోసమే తవ్వకాలా ?? రంగనాయక స్వామి కోనేరు పూడ్చివేతపై ఆగ్రహావేశాలు

Phani CH

|

Updated on: Jul 10, 2024 | 7:11 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి పెద్ద గుట్టపై రంగనాయక స్వామి కోనేరును ఆకతాయిలు పూడ్చివేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. అమావాస్య రోజే ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుప్తనిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనపై ఎంపి డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల సీఐ ఆది రెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు.

మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణం బాదేపల్లి పెద్ద గుట్టపై రంగనాయక స్వామి కోనేరును ఆకతాయిలు పూడ్చివేసిన ఘటన వివాదాస్పదమవుతోంది. అమావాస్య రోజే ఇలాంటి ఘటన జరగడం పట్ల భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుప్తనిధుల కోసమే కోనేరులో తవ్వకాలు జరిపి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఘటనపై ఎంపి డికే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల సీఐ ఆది రెడ్డి, ఇతర ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎంపీ డికే అరుణ స్పష్టం చేశారు. స్వయంభువుగా వెలసిన రంగనాయక స్వామిని శ్రావణమాసంలో దర్శించుకుని తరించడం ఈ ప్రాంత ప్రజలకు ఆనవాయితీగా వస్తోంది. ప్రకృతి సహజంగా ఏర్పడిన కోనేరును గుట్టుచప్పుడు కాకుండా పూడ్చి వేయడం పట్ల పట్టణ ప్రజలలో ఆగ్రహం నెలకొంది. ఆ కోనేరు నీటితోనే స్వామివారి విగ్రహాన్ని శుద్ధి చేసి పూజాది కైంకర్యాలు నిర్వహిస్తుంటారని అలాగే భక్తులు కోనేరులో స్నానాదులు ముగించుకొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం స్వామి ఆ క్షేత్రంలో వెలసినప్పటినుండి కొనసాగుతోందని అంటున్నారు. అలాంటి కోనేరును ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పూడ్చి వేయడం తమను తీవ్రంగా కలిచి వేసిందని భక్తులు అంటున్నారు. దాంతో వారు ఆలయ పరిరక్షణ కోసం కమిటీగా ఏర్పడి కోనేరు పూడ్చివేతకు పాల్పడిన వారిపై ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పోలీసులా ?? అయితే మాకేంటి ?? ఇది… హైదరాబాద్ పబ్‌ల తీరు

నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??