నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??

నేలపై పడుకోవడం మంచిదా ?? కాదా ?? నిపుణులు ఏం చెబుతున్నారు ??

Phani CH

|

Updated on: Jul 10, 2024 | 7:08 PM

నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతారు. మరి నేలపై పడుకుంటే ఏమవుతుంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మంచం మీద పడుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందని, నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. మరి ఇది ఎంతవరకు నిజం? మంచంపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. కానీ, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తారు చాలా మంది.

నేలమీద కూర్చొని భోజనం చేయడం వల్ల ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతారు. మరి నేలపై పడుకుంటే ఏమవుతుంది అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా..? మంచం మీద పడుకోవడం వల్ల వెన్నునొప్పి వస్తుందని, నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చాలా మంది నమ్ముతారు. మరి ఇది ఎంతవరకు నిజం? మంచంపై పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది. కానీ, నడుం నొప్పి, ఒళ్లు నొప్పులు వస్తాయని, ఉన్న నొప్పి మరింత ఎక్కువ అవుతుందని భావిస్తారు చాలా మంది. అందుకే నేలపై పడుకుంటే వెన్నునొప్పి తగ్గుతుందని నమ్మేవారు చాలా మందే ఉంటారు. కానీ, ఇది వాస్తవం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి అస్సలు తగ్గదని చెబుతున్నారు. దీంతో ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. నేలపై పడుకోవడం వల్ల వెన్నెముకపై చెడు ప్రభావం పడుతుందని అంటున్నారు.. గట్టిగా ఉండే నేల ఉపరితలంపై పడుకోవడం వల్ల మీ వెన్నెముక దాని సహజ వక్రతను నిర్వహించడానికి తగినంత మద్దతు ఉండదు. దీనివల్ల కాలక్రమేణా మీ వెన్నెముక దృఢత్వం తగ్గుతుంది. అలాగే వెన్నెముక అమరిక దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లి వారసులతో కారులో ముకేశ్‌-నీతా అంబానీ షికారు

పోలీసులు తీర్చలేని పంచాయితీని.. చిటికెలో పరిష్కరించిన గేదె

ఒరేయ్ ఎవర్రా నువ్వు.. పాము కాటేస్తే ఇలా చేస్తావా

మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు

ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!