Watch Video: బుసలు కొడుతూ షేకాడించిన భారీ కింగ్ కోబ్రా.. అమెజాన్‌లో కాదు.. మన అనకాపల్లిలోనే.. షాకింగ్ వీడియో
అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా అక్కడి స్థానికులను హడలెత్తించింది. చీడికాడ మండలం తురువోలు శివారులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. బుడ్డవారి కల్లాలోని పశువుల పాకలో దూరడాన్ని రైతు గమనించారు. తొంగి చూసేసరికి.. బుసలు కొడుతున్న శబ్దరావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. రైతులు, అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ సొసైటీకి సమాచారం ఇచారు.
అనకాపల్లి జిల్లాలో భారీ రాచనాగు బుసలు కొట్టింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 అడుగుల కింగ్ కోబ్రా అక్కడి స్థానికులను హడలెత్తించింది. చీడికాడ మండలం తురువోలు శివారులో కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. బుడ్డవారి కల్లాలోని పశువుల పాకలో దూరడాన్ని రైతు గమనించారు. తొంగి చూసేసరికి.. బుసలు కొడుతున్న శబ్దరావడంతో భయభ్రాంతులకు గురయ్యారు. రైతులు, అటవీ శాఖ అధికారులు, ఈస్టర్న్ ఘాట్ సొసైటీకి సమాచారం ఇచారు. రంగంలోకి దిగిన ఈస్టర్న్ ఘాట్స్ సొసైటీ ప్రతినిధులు, అటవీ శాఖ సిబ్బంది కలిసి కింగ్ కోబ్రాను పట్టుకొన్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుకున్న కింగ్ కోబ్రాను అడవుల్లో విడిచిపెట్టారు.
అయితే చాలా సేపు రాచనాగు గోనెసంచిలోకి దూరేందుకు నిరాకరించింది. అతి కష్టం మీద తోక పట్టుకుని సంచిలో బంధించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. పరిస్థితిని ముందుగానే అంచనావేసి పెను ప్రమాదం నుంచే బయటపడ్డమని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంతటి పొడవైన కింగ్ కొబ్రా లభ్యమవ్వడం తొలిసారి అని అంటున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

