బుల్లి వారసులతో కారులో ముకేశ్-నీతా అంబానీ షికారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఆకాశాన్నంటుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వేడుకలు మొదలవ్వగా.. శుక్రవారం రాత్రి సంగీత్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ముకేశ్ , ఆయన సతీమణి నీతా అంబానీ, తమ బుల్లి వారసులతో కారులో షికారు చేస్తూ కన్పించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి ఆకాశాన్నంటుతోంది. ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చెంట్ వివాహం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఇప్పటికే వేడుకలు మొదలవ్వగా.. శుక్రవారం రాత్రి సంగీత్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో ముకేశ్ , ఆయన సతీమణి నీతా అంబానీ, తమ బుల్లి వారసులతో కారులో షికారు చేస్తూ కన్పించారు. వింటేజ్ ఓపెన్ టాప్ కారులో ముకేశ్ అంబానీ డ్రైవింగ్ చేస్తుండగా నీతా, మనవళ్లు పృథ్వి, కృష్ణ, మనవరాళ్లు ఆద్యశక్తి, వేద పక్కన కూర్చున్నారు. అలనాటి బాలీవుడ్ నటుడు షమ్మీ కపూర్ నటించిన ‘బ్రహ్మచారి’ సినిమాలోని ‘చక్కే మే చక్కా’ పాటను పాడుతూ వారు షికారు చేస్తున్నట్లుగా ఉన్న వీడియోను సంగీత్ లో ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీసులు తీర్చలేని పంచాయితీని.. చిటికెలో పరిష్కరించిన గేదె
ఒరేయ్ ఎవర్రా నువ్వు.. పాము కాటేస్తే ఇలా చేస్తావా
మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గదిలో మద్యం బాటిళ్లు
ఇకపై కరెంట్ బిల్లు కట్టడం మరింత ఈజీ!
ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం

స్నేహితుడికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి.. మహిళగా మార్చి అత్యాచారం

పేలిన రిఫ్రిజిరేటర్.. మసిబొగ్గుగా మారిన ఇల్లు..!

170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు

థాయ్ మసాజ్ కావాలన్నారు.. పొదల్లోకి తీసుకెళ్లి..వీడియో
