ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!

ఇటీవ‌ల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం త‌దిత‌ర యాప్‌ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం నిలిపివేశారు. దీంతో వినియోగ‌దారులు క‌రెంటు బిల్లుల చెల్లింపు కోసం మీ సేవ కేంద్రాలు, క‌రెంటు ఆఫీసుల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!

|

Updated on: Jul 09, 2024 | 5:36 PM

ఇటీవ‌ల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం త‌దిత‌ర యాప్‌ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ కారణంగా కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సదుపాయం నిలిపివేశారు. దీంతో వినియోగ‌దారులు క‌రెంటు బిల్లుల చెల్లింపు కోసం మీ సేవ కేంద్రాలు, క‌రెంటు ఆఫీసుల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది. ఈ నేప‌థ్యంలో ప్రజ‌ల అవ‌స్థల‌ను గ‌మ‌నించిన ప్రభుత్వం కరెంటు బిల్లుల చెల్లింపు కోసం కొత్తగా క్యూఆర్‌ కోడ్ విధానం తీసుకువ‌స్తోంది. ఆగస్ట్ నుంచి వినియోగ‌దారుల‌కు జారీ చేసే కరెంటు బిల్లులపై క్యూఆర్ కోడ్‌ను ముద్రించ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ద‌క్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని తీసుకువ‌చ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వినియోగ‌దారులు ఆ కోడ్‌ని స్కాన్ చేసి సులువుగా కరెంటు బిల్లు కట్టేయొచ్చు. బిల్లు కింద వ‌చ్చే క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి మ‌న‌కు నచ్చిన పేమెంట్ యాప్ ద్వారా కరెంటు బిల్లును చెల్లించవచ్చు. వినియోగ‌దారులు తమ మొబైల్స్ ద్వారా క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ తదితర విధానాల్లో బిల్లులను చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచం అంతంపై.. బాబా వంగా సరికొత్త జోస్యం

తక్కువ ధరలో అయోధ్య, కాశీలను.. దర్శించే అద్భుత అవకాశం

బీట్ రూట్ ఆరోగ్యానికి మంచిదని అదే పనిగా తింటున్నారా ?? జాగ్రత్త !!

శ్రీశైలంలో బయటపడ్డ పురాతన శివలింగం.. 14,15 శతాబ్లకు చెందినవిగా గుర్తింపు

Follow us